STRINGENT ACTION AT HIGH PRICES: TTD EO _ శ్రీవారి భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు : టీటీడీ ఈవో

Tirumala, 17 June 2024: TTD EO Sri J Syamala Rao warned on stringent action against the shopkeepers if they sell articles with higher prices than fixed by the TTD to the devotees who come to Tirumala for the darshan.

Following the complaints by some devotees about a few shopkeepers alongside Srivari Mettu footpath route selling at high prices and Srivari Mettu route the EO directed JEO Health and Education Smt Goutami to look into the issue. Under her supervision, TTD Estate Officer Sri Guna Bhushan Reddy inspected three shops at Srivari Mettu.

It was found that the goods were being sold at high prices in shop number-3. In this context, the EO said that strict action will be taken if the prices are higher than those prescribed by TTD to the devotees anywhere in Tirumala and Tirupati.

A show cause notice will be issued to Sri Vinod Kumar of shop 3 who sold at high prices in violation of the TTD rules along with a fine of Rs.25 thousand rupees will be imposed against him.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు : టీటీడీ ఈవో

తిరుమల, 17 జూన్ 2024: తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసి భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో శ్రీ జె శ్యామల రావు చెప్పారు.

శ్రీనివాసమంగాపురం, శ్రీవారి మెట్టు మార్గంలో దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు కొంతమంది భక్తులు ఫిర్యాదు చేశారు. టీటీడీ ఈవో ఆదేశాల మేరకు, జేఈఓ (విద్యా, వైద్యం) శ్రీమతి గౌతమి పర్యవేక్షణలో టీటీడీ ఎస్టేట్ అధికారి శ్రీ గుణ భూషణ్ రెడ్డి శ్రీవారి మెట్టు వద్ద ఉన్న మూడు షాపులను తనిఖీ చేశారు. ఇందులో షాప్ నంబర్-3లో వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

ఈ నేపథ్యంలో తిరుమల, తిరుపతిలలో ఎక్కడైనా భక్తులకు టీటీడీ నిర్దేశించిన ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు.

అదేవిధంగా టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయించిన షాప్ నెంబర్ -3 శ్రీ వినోద్ కుమార్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసి, రూ.25 వేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే త్రికా ప్రకటన