TTD EO REVIEWS DEPARTMENTS _ టీటీడీలోని విభాగాలపై ఈవో సమీక్ష
INSPECTS RECEPTION AREAS AND LADDU COUNTERS
TIRUMALA, 17 JUNE 2024: TTD EO Sri J Syamala Rao on Monday took an overall view on all the departments and reviewed on the major departments including Temple, Reception, Annaprasadam and Engineering department in detail.
A review meeting was held at Gokulam Rest House in Tirumala along with JEOs Smt Goutami, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore and other senior officers of TTD.
Speaking on the occasion, the EO said, Tirumala has got emotional bonding in the society. “So it is our primary duty to ensure quality food, sanitation and other facilities to the best possible manner to the satisfaction of the pilgrim devotees. During my observations in my maiden inspection yesterday, from the feedback I received from the pilgrims, we need to fill the gaps to reach their expectations”, he maintained.
Later he instructed the JEO to prepare Standard Operating Procedures (SoP) besides establishing a Feedback Mechanism along with a Check List and Time Line for every department.
The EO reviewed in length the various formats of Darshan, online quota release, seva tickets with resepct to temple, modes of accommodation in Reception wing and also the Engineering works with the officials concerned.
Senior Officers of TTD including CEO SVBC Sri Shanmukh Kumar, FACAO Sri Balaji, DLO Sri Veeraju, CE Sri Nageswara Rao and other Heads were also present.
Inspection
Earlier during the day, EO inspected Cottages in Mullakunta area, Laddu counters and interacted with the pilgrims to know about the facilities.
Later, he checked the taste and quality of Annaprasadam being served to the pilgrims at Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex(MTVAC) and received the feedback from the pilgrims.
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టీటీడీలోని విభాగాలపై ఈవో సమీక్ష
తిరుమల, 17 జూన్ 2024: టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు సోమవారం అన్ని విభాగాధిపతులతో సమగ్రంగా సమీక్షించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్‌వో శ్రీ నరసింహ కిషోర్‌తో పాటు టీటీడీ ఉన్నతాధికారులతో ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా, సంతృప్తి చెందేలా సేవలు అందించాలన్నారు.
దర్శనం, వసతి, నాణ్యమైన అన్నప్రసాదాలు, పారిశుధ్యం, ఇతర సౌకర్యాలను అత్యున్నతంగా అందించడం మనందరి బాధ్యత అన్నారు. ఆదివారం తన తనిఖీలో పరిశీలించినప్పుడు, భక్తుల నుండి అందిన అభిప్రాయాలు, వారి అంచనాలను చేరుకోవడానికి మనమందరం ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉంది ” అని ఈవో అధికారులకు పిలుపునిచ్చారు.
ప్రతి విభాగంలో చెక్ లిస్ట్, టైమ్‌లైన్, ఫీడ్‌బ్యాక్ యంత్రాంగం ఏర్పాటు చేయడంతో పాటు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌లను (SoP) సిద్ధం చేయాలని ఆయన జేఈవోను ఆదేశించారు.
దర్శనం, ఆన్‌లైన్ కోటా విడుదల, ఆలయానికి సంబంధించి సేవా టిక్కెట్లు, రిసెప్షన్ విభాగంలో వసతి విధానాలు మరియు ఇంజనీరింగ్ పనులపై సంబంధిత అధికారులతో ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు.
ఈ ఓ తణిఖీలు
అంతకు మునుపు టిటిడిఈఓ ముళ్ళకుంట ప్రాంతంలోని
వసతి గృహాలు, లడ్డు కౌంటర్లను తణిఖీ చేసి భక్తుల నుండి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌విబిసి సిఇఓ శ్రీ షణ్ముఖ్ కుమార్, ఎఫ్ఎసిఎఓ శ్రీ బాలాజీ, డిఎల్ఓ శ్రీ వీర్రాజు, సిఇ శ్రీ నాగేశ్వరరావు మరియు అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే త్రికా ప్రకటన