STUDY FESTIVALS BEGIN AT SRIVARI TEMPLE _ శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం
శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం
తిరుమల, 2024 డిసెంబరు 30: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 25 రోజుల పాటు జరుగనున్న అధ్యయనోత్సవాలు సోమవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు రంగనాయకుల మండపంలో అధ్యయనోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు.
ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జియ్యంగార్లు గోష్ఠిగానం చేస్తారు.
కాగా ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, శ్రీవారి ఆలయ పేష్కర్ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.