SUDDHA TIRUMALA-SUNDARA TIRUMALA A GRAND SUCCESS WITH THE TTD EMPLOYEES _ శుద్ధ తిరుమల- సుందర తిరుమలను విజయవంతం చేశారు

“LET US PLEDGE TO MAKE TIRUMALA PLASTIC FREE” – TTD EO

 

TIRUMALA, 17 MAY 2023: The innovative and unique mass cleansing programme taken up by TTD to protect the environs of Tirumala with its employees, the Suddha Tirumala-Sundara Tirumala has been a huge success and the TTD EO Sri AV Dharma Reddy lauded the strong workforce of TTD for having participated in this cleaning mission with enthusiasm setting an example to other organisations.

 

During the senior officer’s review meeting held at Sri Padmavathi Rest House in Tirupati on Wednesday, the EO said in the next step, the shops, hotels, taxi drivers and RTC should also be involved to bring awareness on eradicating the usage of plastic in Tirumala. “For this take the help of Police, APSRTC officers also to avoid plastic in both the Ghats and footpath routes and arrange the dust bins in all the routes to Tirumala, he directed the Health department officials. 

 

He also reviewed on the progress of construction works of the SP Children’s Heart Centre, Cafeteria in BIRRD etc. and learnt from the officials concerned about the status of Dhyana Mandiram in SV Vedic University. “Conduct Kriya Yoga, Meditation classes in this building and instructed the SVBC officials to design programs that showcase the importance of Veda Vignanam on human lifestyle. “Similarly prepare short videos on the great quotes by our Sages and renowned personalities and propagate them via our social media network”, he suggested. The EO later reviewed the Manuscripts Project and the removal of the Acacia plantation in the Tirumala forests.

 

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, SVBC CEO Sri Shanmukh Kumar, DLO Sri Veeraju, FACAO Sri Balaji, CAuO Sri Sesha Sailendra, CE Sri Nageswara Rao and other officials were also present. 

 

  

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శుద్ధ తిరుమల- సుందర తిరుమలను విజయవంతం చేశారు

– అధికారులు, ఉద్యోగులకు టీటీడీ ఈవో శ్రీ ధర్మారెడ్డి అభినందన

తిరుమల 17 మే 2023: తిరుమలను ప్లాస్టిక్ రహిత ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చేందుకు నిర్వహించిన శుద్ధ తిరుమల సుందర తిరుమల కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు, ఉద్యోగులు, ఇతర విభాగాల సిబ్బంది విజయవంతం చేశారని టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి అభినందించారు.
రాబోయే రోజుల్లో ప్రభుత్వ విభాగాల్లో పనిచేసేవారు, ఇతరులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి ముందుకు వస్తే వారి సేవలు వినియోగించుకోవాలని ఆరోగ్యాధికారి కి సూచించారు.

తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో బుధవారం ఈవో సీనియర్ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమలతో పాటు నడకదారుల్లోని దుకాణదారుల కు పారిశుద్ధ్య నిర్వహణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. టాక్సి , ప్రైవేట్ వాహనాలు , ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు వెళ్ళే భక్తులకు ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధంపై అవగాహన కల్పించడానికి పోలీస్,ఆర్టీసీ అధికారుల సహకారం తీసుకోవాలన్నారు . తిరుమలతో పాటు, ఘాట్ రోడ్లు, నడకదారుల్లో ప్లాస్టిక్ ఉత్పత్తులను వాడకుండా భక్తులకు అవగాహన కల్పించేలా దుకాణ దారులకు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు.
విరివిగా చెత్త బుట్టలు ఏర్పాటుచేసి వ్యర్థపదార్థాలను అందులోనే వేసేలా అవగాహన కల్పించాలన్నారు.

శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనాల నిర్మాణ వేగం పెంచాలని ఆదేశించారు. ఆసుపత్రికి అవసరమయ్యే యంత్ర పరికరాల సమీకరణకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. స్విమ్స్, బర్డ్, చిన్నపిల్లల గుండె చికిత్సలఆసుపత్రిలో రోగులు, సిబ్బంది, డాక్టర్లకు సౌకర్యవంతంగా ఉండేలా కేఫ్తెరియా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.

వేద విశ్వవిద్యాలయంలో కొత్తగా ధ్యాన మందిరం నిర్మించి అక్కడ క్రియ యోగ శిక్షణ ఏర్పాటు చేయాలన్నారు. ఆధునిక జీవన విధానంపై వేద విజ్ఞానం ప్రాముఖ్యతపై ఎస్వీ బీసీ కార్యక్రమాలు రూపొందించాలని శ్రీ ధర్మారెడ్డి చెప్పారు. అలాగే మహర్షులు, గొప్ప వారి సూక్తులు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలన్నారు. మ్యాన్ స్క్రిప్ట్స్ ప్రాజెక్టుకు అవసరమైన మౌళిక వసతులు కల్పించాలన్నారు.

తిరుమల అడవుల్లో అకేషియా చెట్ల తొలగింపు పై సమీక్షించారు.

జేఈవో లు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, ఎస్వీ బీసీ సిఈవో శ్రీ షణ్ముక్ కుమార్, లా ఆఫీసర్ శ్రీ వీర్రాజు, ఎఫ్ ఎ సిఎవో శ్రీ బాలాజి, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శ్రీ శేష శైలేంద్ర,చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది