SUPREME COURT JUDGE AND AP HIGH COURT CJ LAUDS TTD DHARMIC ACTIVITIES _ టీటీడీ ధార్మిక కార్యకలాపాలు అద్భుతం : సుప్రీం కోర్ట్ జడ్జి మరియు ఎపి హైకోర్టు సిజే కితాబు

VISITS DHARMAGIRI VEDA VIGNANA PEETHAM

TIRUMALA, 12 AUGUST 2023: The Honourable Supreme Court Judge, Justice Bhushan Ramakrishna Gavai and the Honourable CJ of AP Justice Dhiraj Singh Thakur poured in laurels on TTD for the various Dharmic and spiritual activities and sustaining the Hindu Sanatana Dharma promoting Vedic education in a widespread manner.

The justices duo paved a visit to the TTD-run Dharmagiri Veda Vignana Peetham on Saturday evening accompanied by TTD EO Sri AV Dharma Reddy and were enthused to know about the vedic institution which has been imparting Vedic Education to tens of thousands of pupils from the past almost 140 years ever since its emergence in 1884.

The 400 odd students of the institution have given a warm reception to the protocol dignitaries by rendering Purusha Suktam which imparted divine vibes to the invitees.

Earlier the EO explained to the dignitaries that TTD runs about 33 educational institutions which includes six Vedic institutions and a Vedic University. He also briefed them on the stipend given to the vedic students once they complete their 12-year and 8-year courses in the institutions.

Addressing the students later, both the justices hailed the services of TTD with a noble aim to upkeep the Vedic education for the future generations.

Later the dignitaries were felicitated by the Vedic faculty. 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ ధార్మిక కార్యకలాపాలు అద్భుతం : సుప్రీం కోర్ట్ జడ్జి మరియు ఎపి హైకోర్టు సిజే కితాబు

– ధర్మగిరి వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించిన న్యాయమూర్తులు

తిరుమల, 12 ఆగస్టు 2023: సనాతన హైందవ ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ, వేద విద్యను ప్రోత్సహిస్తున్న టీటీడీని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ మరియు ఎపి హైకోర్టు సిజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రశంసించారు.

శనివారం సాయంత్రం టిటిడి ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డితో కలిసి టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ధర్మగిరి వేద విజ్ఞాన పీఠాన్ని న్యాయమూర్తులు సందర్శించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, 1884లో విజ్ఞాన పీఠం ఆవిర్భవించిందని, దాదాపు 140 సంవత్సరాలు అయిందని, ఎన్నో సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులకు వేద విద్యను అందిస్తున్నదని న్యాయమూర్తులకు తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 33 విద్యాసంస్థలలో ఆరు వేద విద్యా సంస్థలు, ఒక వేద విశ్వవిద్యాలయం ఉన్నట్లు చెప్పారు. వేద విద్యార్ధులు తమ 12 సంవత్సరాల మరియు 8 సంవత్సరాల కోర్సులను సంస్థల్లో పూర్తి చేసిన తర్వాత వారికి ఇచ్చే స్టైఫండ్ గురించి కూడా ఆయన వారికి వివరించారు.

వేద విజ్ఞాన పీఠంలోని 400 మంది విద్యార్థులు పురుష సూక్తం పటించడం ద్వారా
అహ్వానితులకు ఆధ్యాత్మిక తన్మయత్వం కలిగించారు.

తరువాత విద్యార్థులనుద్దేశించి న్యాయమూర్తులు మాట్లాడుతూ, వేద విద్యను భావి తరాలకు అందించాలనే ఉన్నతమైన లక్ష్యంతో టీటీడీ చేస్తున్న సేవలను కొనియాడారు.

అనంతరం ప్రముఖులను వేద అధ్యాపకులు ఘనంగా సన్మానించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.