SURPRISE CHECK BY TTD EO _ అలిపిరి నడక మార్గంలో టీటీడీ ఈవో ఆకస్మిక తనిఖీలు

TIRUMALA, 12 AUGUST 2023: After beefing up security measures along the Alipiri footpath route on Saturday, the TTD EO Sri AV Dharma Reddy carried out a surprise check in the night from Seventh Mile to Lakshmi Narasimha Swamy temple trekking the footpath.

The EO inspected the pilgrim safety measures which came into force on Saturday that included increasing security guards at vulnerable points, grouping the devotees in a set of 100 and allowing them to trek the footpath route in the accompaniment of a Security Guard, continuous announcements informing the parents taking care of their children while trekking the footpath etc.

The TTD EO walked along with a set of pilgrims and enlightened them on the safety measures to keep themselves cautious from the attacks of wild beasts.

TTD Vigilance, Engineering and Forest officials were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అలిపిరి నడక మార్గంలో టీటీడీ ఈవో ఆకస్మిక తనిఖీలు

తిరుమల, 12 ఆగస్టు 2023: అలిపిరి కాలిబాట మార్గంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసిన అనంతరం శనివారం రాత్రి ఏడో మైలు నుండి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వరకు కాలినడకన టిటిడి ఈవో శ్రీ ఏవి. ధర్మారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈవో శనివారం ఉదయం నుండి అమల్లోకి వచ్చిన యాత్రికుల భద్రతా చర్యలను పరిశీలించారు. ఇందులో భక్తులకు హాని కలిగించే ప్రదేశాలలో సెక్యూరిటీ గార్డులను పెంచడం, భక్తులను 100 మందితో గ్రూప్ గా సెక్యూరిటీ గార్డ్‌తో పాటు నడక మార్గంలో మార్గంలో ఏలా అనుమతిస్తున్నారు, నిరంతర ప్రకటనలు, నడిచి వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను ఏలా చూసుకుంటున్నారు తదితర అంశాలను పరిశీలించారు.

టీటీడీ ఈవో యాత్రికులతో కలిసి నడుస్తూ క్రూరమృగాల దాడుల నుంచి అప్రమత్తంగా ఉండేందుకు భద్రతా చర్యలపై వారికి అవగాహన కల్పించారు.

ఈవో వెంట టీటీడీ విజిలెన్స్‌, ఇంజినీరింగ్‌, అటవీశాఖ అధికారులు ఉన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.