SURYA GRAHANAM ON OCTOBER 25 AND CHANDRA GRAHANAM ON NOVEMBER 8 _ అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం

TIRUMALA TEMPLE DOORS TO BE CLOSED FOR 12 HOURS ON EACH DAY

 

TTD CANCELS ALL DARSHANS – ONLY SARVA DARSHAN IS ALLOWED

 

TTD ANNAPRASADAM COMPLEX  ALSO REMAINS CLOSED ON THESE TWO DAYS

 

TIRUMALA, 11 OCTOBER 2022: In connection with Surya Grahanam [Solar Eclipse] on October 25 and Chandra Grahanam [Lunar Eclipse] on November 8, the Tirumala temple doors will remain closed for almost 12 hours on each of these days.

 

The Surya Grahanam occurs on October 25 between 5:11 PM to 6:27PM and the temple doors will remain closed by 8:11 AM and will be re-opened after carrying out Suddhi rituals by 7:30 PM.

 

Similarly, on the day of Chandra Grahanam on November 8, which is scheduled between 2:39 PM to 6:19 PM, the temple doors will be closed by 8:40 AM and re-opened by 7:20 PM.

 

TTD has cancelled, VIP Break Darshan, SRIVANI Trust, Rs.300/- SED and also the Arjitha Sevas such as Kalyanotsavam, Unjal Seva, Brahmotsavam and Sahasra Deepalankara Sevas on these two days. All the privileged darshans including Senior citizens, Physically Handicapped, and parents with infants, NRIs, Defence Personnel etc. also remains cancelled. 

 

Only Sarva Darshan pilgrims are allowed for darshan after the re-opening of temple doors, through VQC-II on these two days.

 

Usually, during Grahanam days, cooking will not be done till the eclipse is released. The Annaprasada Bhavan will also remain closed till the completion of eclipse.

 

TTD has appealed to devotees from across the country as well as overseas to make a note of these things on the two eclipse days occurring in October 25 and November 8 and plan their pilgrimage accordingly to Tirumala to avoid inconvenience.

 
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం

– ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత

– అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి

– గ్ర‌హ‌ణ స‌మ‌యంలో అన్న‌ప్ర‌సాద వితరణ ఉండ‌దు

తిరుమల, 2022 అక్టోబ‌రు 11: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూసివేస్తారు. బ్రేక్ ద‌ర్శనం, శ్రీ‌వాణి, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, ఇత‌ర ఆర్జిత సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది. స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తారు.

అక్టోబ‌రు 25న మంగ‌ళ‌వారం సాయంత్రం 5.11 గంట‌ల నుండి 6.27 గంట‌ల వ‌ర‌కు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కార‌ణంగా ఉద‌యం 8.11 నుండి రాత్రి 7.30 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. అనంత‌రం స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తారు.

అదేవిధంగా న‌వంబ‌రు 8న మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 2.39 గంట‌ల నుండి సాయంత్రం 6.27 గంట‌ల వ‌ర‌కు చంద్ర‌గ్రహణం ఉంటుంది. ఈ కార‌ణంగా ఉద‌యం 8.40 నుండి రాత్రి 7.20 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తారు.

సాధారణంగా గ్రహణం రోజుల్లో గ్రహణం తొల‌గిపోయే వరకు వంట చేయరు. తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇత‌ర ప్రాంతాల్లో కూడా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ఉండ‌దు.

కావున‌ భ‌క్తులు ఈ విషయాన్ని గమనించి, అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు వీలుగా త‌మ తిరుమల యాత్రను రూపొందించుకోవాల‌ని టిటిడి మ‌రోసారి విజ్ఞప్తి చేస్తోంది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.