SURYA JAYANTHI FERVOUR GRIPS TIRUMALA HILLS _ సూర్యప్రభవాహనంపై శ్రీ మన్నారాయణుడు

ALL ROADS LEADS TO HILL TOWN

 UNPRECEDENTED PILGRIM TURN OUT FOR RADHASAPTHAMI

 SURYA JAYANTHI REMINDS BRAHMOTSAVA GARUDA SEVA RUSH

 ALL GALLERIES BRIM WITH PILGRIMS FROM 4AM ITSELF

 CONTINUOUS ANNAPRASADAM SERVICES TO PILGRIMS

Tirumala, 1 Feb. 20: Unprecedented turnout of pilgrims has been witnessed on the occasion of Surya Jayanthi and Radhasapthami at Tirumala on Saturday.

 

SURYANARAYANAMURTHY MARCHES MAJESTICALLY ON SURYAPRABHA:

Sri Malayappa Swamy as Sri Suryanarayana Murthy marched majestically all along the four mada streets blessing the tens of thousands of devotees who were converged to witness the charm of lord on the dazzling Surya Prabha Vahanam. The first rays of the sun fell on the processional deity at 6.55am much to the muse of devotees who chanted univocally, Govinda …Govinda with utmost devotion. 

ARRANGEMENTS IN GALLERIES:

All the galleries located in four mada streets surrounding Srivari temple were filled with pilgrims full to their capacities from wee hours of Saturday itself. The crowd appeared as if annual Garuda Seva is taking place in Tirumala. With the German shelters laid in all galleries, the devotees did not move an inch and stayed back to watch all the vahana sevas from dawn to dusk. 

SURYASTAKAM AND ADITYAHRIDAYAM:

Even as the carrier entered the North West Mada street corner, the students of SV Balamandiram, recited Aditya Hridayam and Suryastakam stotras with rhythm and melody. 

BHAJANS BY BHAKTI BRINDAMS

The bhajan troupes have presented Bhakti sangeet before the procession of each vahana seva. The HDPP artistes have also performed Kolatam in front of the carriers which added colour and charm to the vahana sevas and entertained the devotees.

SERVICES BY SRIVARI SEVAKS AND SCOUTS

The services by Srivari Seva volunteers and Scouts and Guides were lauded by the pilgrims who expressed immense satisfaction. The timely food and water distribution in all galleries reached every last pilgrim, in spite of huge turnout of pilgrim crowds. The scouts on the other hand along with Garuda Mitra (student volunteers deployed by Police department) streamlined the pilgrim crowds. 

ANNAPRASADAM AND HEALTH SERVICES:

The Annaprasadam is served to pilgrims at all 60 food counters and over 800 odd Srivari Sevakulu were deployed to render services to pilgrims in all gallereis. Apart from this, 2lakh buttermilk packets were distributed to pilgrims and another two lakh water bottles were distributed to the pilgrims.

ENGINEERING:

 

The erection of 26 LED screens all along the four mada streets facilitated the devotees to watch the procession of Lord on different vahanams on the occasion. 

VIGILANCE:

The TTD Vigilance in co-ordination with police have provided security cover to the pilgrims with the help of Srivari Sevaks, scouts, NCC and Police Mitra volunteers.

TTD EO Sri Anil Kumar Singhal, Addl EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Board Members Sri J Sekhar Reddy, Smt V Prashanthi, Dr B Parthasaradhi Reddy, Dr Nichitha Muppavarapu, Sri P Murali Krishna, Sri V Krishnamoorthy, Sri R Kumaraguru, Sri Bhumana Karunakar Reddy, Chief Engineer Sri Chandrasekhar Reddy, ACVOS Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Lokanadham and other took part.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

సూర్యప్రభవాహనంపై శ్రీ మన్నారాయణుడు

తిరుమలలో వైభవంగా రథసప్తమి

తిరుమల, 2020 ఫిబ్ర‌వ‌రి 01: సూర్య జయంతిని పురస్కరించుకొని శ‌నివారంనాడు తిరుమలలో ‘రథసప్తమి’ ఉత్సవాన్ని టిటిడి అంగరంగ వైభవంగా నిర్వహించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలను తలపించే రీతిలో తిరుమల క్షేత్రం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. ఉద‌యం జ‌రిగిన సూర్య‌ప్ర‌భ వాహ‌న‌సేవ‌లో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి గౌ. శ్రీ‌. ప‌ళ‌ణిస్వామి పాల్గొన్నారు.

ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీమలయప్పస్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ, భక్తులను అనుగ్రహించడం విశేషం.

రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై ఊరేగే స్వామివారి కమనీయ రూపాన్ని దర్శించడానికి భక్తులు తండోపతండాలుగా విచ్చేశారు.

సూర్యప్రభ వాహనం (ఉదయం 5.30 గం||ల నుండి 8 గం||ల వరకు) : అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహనసేవ సూర్యప్రభవాహనం. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం 6.55 గంట‌ల‌కు శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు. ఈ వాహనసేవ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఉదయాత్పూర్వం నుండి ఎంతో ఆసక్తితో నిరీక్షిస్తున్న వేలాది మంది భక్తిపారవశ్యంతో పులకించారు. భక్తుల గోవిందనామస్మరణ మధ్య స్వామివారి వాహనసేవ వైభవంగా జరిగింది.

ఆకట్టుకున్న బాలమందిరం విద్యార్థుల  ‘ఆదిత్యహృదయం’,  ‘సూర్యాష్టకం’ :

రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యప్రభ వాహనసేవలో టిటిడి శ్రీవేంకటేశ్వర బాలమందిరంలో చ‌దుకుంటున్న 150 మంది విద్యార్థులు ఆలపించిన ‘ఆదిత్యహృదయం’, ‘సూర్యాష్టకం’ సంస్కృత‌ శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తర మాడ వీధిలోకి సూర్యప్రభ వాహనం వచ్చిన అనంతరం విద్యార్థులు లయబద్ధంగా శ్లోకాలు ఆలపించారు. నాలుగేళ్లుగా బాలమందిరం విద్యార్థులు శ్లోకాలు ఆల‌పిస్తున్నారు. గతంలో జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల్లోనూ విద్యార్థులు శ్రీనివాసగద్యం త‌దిత‌ర సంస్కృత శ్లోకాలు ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఈ శ్లోక పారాయ‌ణంలో పాల్గొన్నారు.

చిన్నశేష వాహనం : (ఉదయం 9 గం||ల నుండి 10 గం||ల వరకు) సూర్యప్రభ వాహనంపై శ్రీసూర్యనారాయణమూర్తి కమనీయ రూపాన్ని తిలకించి పులకించిన భక్తులు అనంతరం స్వామివారి చిద్విలాసాన్ని చిన్నశేష వాహనంపై తిలకించి తరించారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్న శేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

గరుడ వాహనం : (ఉదయం 11 గం||ల వరకు 12 గం||ల వరకు) స్వామివారికి ఎన్ని వాహనసేవలు ఉన్నా తన ప్రియమైన గరుడ వాహనసేవ లేనిదే పరిపూర్ణత చేకూరదు. అలంకారప్రియుడైన స్వామివారు సర్వాలంకార భూషితుడై, పుష్పమాలాలంకృతుడై ఛత్రచామర సార్వభౌమిక మర్యాదలతో, పక్షిరాజు గరుడునిపై రాజఠీవితో తిరువీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించాడు.

హనుమంత వాహనం : (మధ్యాహ్నం 1 గం|| నుండి మధ్యాహ్నం 2 గం||ల వరకు) భక్తులకు నిజమైన భక్తిరసం, శరణాగతి నిర్వచనాన్ని తెలియపరచడానికి స్వామివారు భక్తాగ్రేసరుడైన హనుమంతుని వాహనంపై పుణ్యక్షేత్ర మాడ వీధులలో ఊరేగి ఆశీర్వదించాడు.

 ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ సి.వెంక‌ట‌ప్ర‌సాద్ కుమార్‌, శ్రీ‌మ‌తి వి.ప్ర‌శాంతి, శ్రీ కుమార‌గురు, శ్రీ శేఖ‌ర్ రెడ్డి ఇత‌ర బోర్డు స‌భ్యులు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.