SURYANARAYANA SWAMY ASTABANDHANA MAHASAMPROKSHANAM_ మే 1 నుండి 6వ తేదీ వరకు తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయ అష్టబంధన మహాసంప్రోక్షణ

Tirupati, 30 April 2018:The ritual of Astabandhana Maha Samprokshanam in the famous temple of Sri Surya Narayana Swamy in Tiruchanoor will be observed for six days from May 1 to 6 including Ankurarpanam on first day.

From the day two to sixth different pujas, will be performed which commences with Kalasa Sthapana on second day and concludes with Maha Samprokshanam on the last day.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మే 1 నుండి 6వ తేదీ వరకు తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయ అష్టబంధన మహాసంప్రోక్షణ

ఏప్రిల్‌ 30, తిరుపతి 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం మే 1 నుండి 6వ తేదీ వరకు జరుగనుంది. గంగుండ్ర మండపంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

మే 1న ఉదయం ఆచార్య ఋత్విక్‌వరణం, సాయంత్రం అంకురార్పణ, మే 2న అకల్మషప్రాయశ్చిత్తహోమం, కలశస్థాపన, మే 3న అష్టబంధన పూజ, అష్టబంధన హోమం, 4న అష్టబంధనం, అధివాసత్రయం, సర్వదైవత్యహోమం, మే 5న మహాశాంతిజప్యం, మహాశాంతి అభిషేకం, మే 6న ఉదయం మహాపూర్ణాహుతి, ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకు మహాసంప్రోక్షణ, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు అశ్వవాహన సేవ జరుగనున్నాయి.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.