IT’S A RARE GOD GIVEN OPPORTUNITY-SMT.SUDHA NARAYANA MURTHY_ టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలిగా శ్రీమతి సుధానారాయణమూర్తి ప్రమాణస్వీకారం

Tirumala, 30 Apr. 18: Getting a second opportunity to serve in the abode of Lord Venkateswara is the rarest thing that happens in one’s life and thank the almighty for giving me the chance, said TTD Trust Board member Smt Sudha Narayanamurthy.

She was administered oath as TTD Trust Board member by Tirumala JEO Sri KS Sreenivasa Raju in Srivari Sannidhi at 6am on Monday.

After darshan of Lord and Vedasirvachanam at Ranganayakula Mandapam, speaking to media persons outside the temple, Mrs. Narayanamurthy said, with the blessings of Lord Venkateswara and Goddess Karunya Lakshmi she will do her part for the benefit of common pilgrims as TTD Trust Board member. “I prayer Lord to provide me strength to execute my duties with responsibility”, she added.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలిగా శ్రీమతి సుధానారాయణమూర్తి ప్రమాణస్వీకారం

ఏప్రిల్‌ 30, తిరుమల 2018: ప్రముఖ సంఘ సేవకురాలు శ్రీమతి సుధానారాయణమూర్తి సోమవారం తిరుమలలోని శ్రీవారి ఆలయంలో టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఉదయం 6.00 గంటలకు శ్రీమతి సుధానారాయణమూర్తితో ప్రమాణం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీమతి సుధానారాయణమూర్తికి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.

ఈ సందర్భంగా ఆలయం వెలుపల శ్రీమతి సుధానారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆస్థానంలో సేవలందించే అవకాశం రెండోసారి తనకు రావడాన్ని అపూర్వంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీవేంకటేశ్వరస్వామివారు, శ్రీ కారుణ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో సామాన్య భక్తులకు మెరుగైన సేవలందించేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. బాధ్యతాయుతంగా తన విధులు నిర్వహించేందుకు కావాల్సిన శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్టు తెలియజేశారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.