ANNAMAIAH PROPAGATED THE ESSENCE OF VEDAS IN THE FORM OF SANKEERTANS

Tirupati, 30 April 2018: Saint poet Sri Tallapaka Annamacharya propagated the essence of vedas in the form of Sankeertans and educated the masses, said co-ordinator of Tarigonda Vengamamba Project Dr KJ Krishnamurthy.

The literary sessions in connection with the 610th Birth Anniversary celebrations of Annamacharya commenced in Annamacharya Kalamandiram at Tirupati on Monday. Speaking on this occasion, Dr Krishnamurthy said Annamacharya has command on spiritual wisdom and the same was depicted in the sankeertans penned by him.

Scholars, Sri Venkatachalapathi,Dr B Sriramulu from Tirupati, also spoke on this occasion while, Sri K Neehal from Chennai presented devotional musical concert and Sri Vaishnavi Nrityalaya artistes from Machilipatnam performed dance ballet.

On the other hand in Mahati Auditorium, Smt Nitya Santhoshini from Chennai presented devotional songs penned by Sri Annamacharya.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

అన్నమయ్య సంకీర్తనల్లో వేద విజ్ఞానం : ఆచార్య కె.జె.కృష్ణమూర్తి

తిరుపతి, ఏప్రిల్‌ 30: శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనల్లో వేద విజ్ఞానం ఇమిడి ఉందని తరిగొండ వెంగమాంబ వాఙ్మయ ప్రాజెక్టు సమన్వయాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి పేర్కొన్నారు. అన్నమయ్య 610వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం సాహితీ సదస్సులు ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా ఆచార్య కె.జె.కృష్ణమూర్తి ‘ఉషాకళ్యాణం’ పై శ్రీ తాళ్లపాక చిన్నన్న రాసిన సాహిత్యాన్ని సోదాహరణంగా వివరించారు. యావత్‌ భక్తి సాహిత్యంలో అన్నమయ్యకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు.

అనంతరం తిరుపతికి చెందిన శ్రీ ఎం. వెంకటాచలపతి ‘అన్నమయ్య – రామదాసు తులనాత్మక పరిశీలన’ అనే అంశంపై ఉపన్యసించారు. అన్నమయ్య- రామదాసు జీవిత విశేషాలను పరిశీలిస్తే కొన్ని సాదృశ్యాలు, వ్యత్యాసాలు కనిపిస్తాయన్నారు. ఇద్దరు తెలుగునాట భాగవత శిఖామణులుగా, భాగవతోత్తములుగా గుర్తింపు పొందారని వివరించారు. ఇద్దరి కీర్తనలలో సామాన్య ప్రజలను చైతన్యవంతం చేసేలా, భక్తిభావాన్ని పెంచేలా ఉన్నాయన్నారు.

తిరుపతికి చెందిన డా. బి. శ్రీరాములు ‘ అన్నమయ్య సంకీర్తనల్లో సందేశం’ అనే అంశంపై ఉపన్యసిస్తూ అన్నమయ్య సంకీర్తనలలో పద సాహిత్యాన్ని సృష్టించడంలో ఒక ప్రత్యేకతను సాధించినట్టు తెలిపారు. శ్రీవారి మీద వేలాది కీర్తనలు రచించినా, భావంలో ఎక్కడా పునరుక్తి లేదని, అన్నీ కొత్తగానే ఉంటాయని అన్నారు.

సాయంత్రం 6 నుండి 7.30 గంటల వరకు చెన్నైకి చెందిన శ్రీ కె. నీహాల్‌ మరియు బృందంచే గాత్ర సంగీతం, 7.30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మచిలీపట్నంకు చెందిన శ్రీ వైష్ణవి నృత్యాలయ బృందం నృత్య కార్యక్రమం జరుగనుంది.

తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు చెన్నైకు చెందిన శ్రీమతి పి. నిత్యసంతోషిణి బృందం సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.