SWAMI PUSHKARINI THEERTHA MUKKOTI OBSERVED _ వైభవంగా వైకుంఠ ద్వాదశి చక్రస్నానం

DWADASI CHAKRASNANAM HELD

TIRUMALA, 11 JANUARY 2025 On the auspicious day of Vaikuntha Dwadasi, the Chakra Snanam was held.

Usually, it is also considered as the most important torrent festival in Tirumala, the Swamy Pushkarini Theertha Mukkoti.

Among the several thousands of Theerthams, Swamy Pushkarini is considered as most auspicious one as it is believed it is the chief source of all the 66crore and odd theerthams present in Seshachala Ranges.

Sri Sudarshana Chakrattalwar was brought to the sacred temple tank during the early hours on Saturday and Chakra Snanam was performed by the Archakas in the holy waters of Swamy Pushkarini in the presence of HH Tirumala Sri Chinna Jeeyar Swami on the occasion. Later the Chakrattalwar returned to the temple.

TTD EO Sri Syamala Rao, Board Member Smt Panabaka Lakshmi, DyEO Sri Lokanatham, Peishkar Sri Rama Krishna and others were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా వైకుంఠ ద్వాదశి చక్రస్నానం

తిరుమల 2025 జనవరి 11: తిరుమలలో వైకుంఠ ద్వాదశి సందర్భంగా వైభవంగా చక్రస్నానం నిర్వహించారు.

ఈ ఉత్సవం తిరుమలలో అతి ముఖ్యమైన త్రైపాక్షిక ఉత్సవంగా భావిస్తారు. దీనినే శ్రీవారి పుష్కరిణి తీర్థ ముక్కోటిగా కూడా పరిగణిస్తారు.

శేషాచలం రేంజ్ లో ఉన్న  66 కోట్ల తీర్థాలన్నింటిలో స్వామివారి పుష్కరిణి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

శనివారం తెల్లవారుజామున శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను పవిత్ర స్వామి వారి పుష్కరిణికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా శ్రీ తిరుమల శ్రీ చిన్న జీయర్ స్వామి సమక్షంలో స్వామి పుష్కరిణి పవిత్ర జలాల్లో అర్చకులు చక్రస్నానం చేశారు. తరువాత చక్రస్నానం ఆలయానికి తిరిగి వచ్చింది.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు, బోర్డు సభ్యురాలు శ్రీమతి పనబాక లక్ష్మి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది