TARIGONDA MEMORIAL SOON IN TIRUMALA _ తిరుమ‌ల‌లో తరిగొండ వెంగమాంబ ఆరాధన కేంద్రం ఏర్పాటు – టిటిడి ఈవో

TIRUPATI, 18 SEPTEMBER 2021: Vengamamba Brindavanam soon to be turned in to a memorial said, TTD EO Dr KS Jawahar Reddy.

 

The EO who inspected Tarigonda village, the native place of the famous saint poetess Matrusri Tarigonda Vengamamba in Chittoor district on Saturday, speaking on the occasion said, like Saint Poet Sri Tallapaka Annamacharya, Vengamamba also attained sadgati at the lotus feet of Sri Venkateswara Swamy with her literary works.

 

The great saint poetess who not only penned great sankeertans in praise of Srivaru but also pioneered Annaprasadam in Tirumala. In her memory only we have been providing Annaprasadam to thousands of devotees every day at Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex”. 

 

The EO also said, a school is under operation at Vengamamba Brindavanam in Tirumala at present. “We will negotiate with the school authorities to vacate the school from that place which involves some procedure. In that place we are contemplating to develop a memorial for Tarigonda Vengamamba”, he added.

 

Earlier the TTD EO inspected the cave located inside Sri Lakshmi Narasimha Swamy temple at Tarigonda. It is believed that through this cave, Vengamamba used to travel 120km on foot to reach Tirumala and render Mutyala (Pearl) Harati to Sri Venkateswara Swamy which is in practice in Tirumala temple even today. The EO also studied the inscription about the temple history and significance. 

 

He told the archakas to plan in a big way to celebrate the annual fete in the temple which is slated in the month of Aswayuja and also directed the concerned to come up with an action plan to observe Vengamamba Vardhanti which is scheduled to take place soon.

 

Deputy EO of local temples Smt Shanti, Annamacharya and Vengamam Project Director Dr A Vibhishana Sharma, engineering officials and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమ‌ల‌లో తరిగొండ వెంగమాంబ ఆరాధన కేంద్రం ఏర్పాటు – టిటిడి ఈవో

తిరుప‌తి, 2021 సెప్టెంబరు 18: తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావ‌నంలో ఆరాధన కేంద్రం ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి తెలిపారు. త‌రిగొండ శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యాన్ని శ‌నివారం ఆయన అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమ‌ల‌లోని తరిగొండ వెంగమాంబ బృందావ‌నం వ‌ద్ద ఉన్న స్కూల్‌ను మ‌రొక ప్రాంతానికి మార్చి త్వ‌ర‌లో అక్కడ ఆరాధన కేంద్రం ఏర్పాటు చేయ‌డానికి టిటిడి ప్ర‌ణాళిక‌లు రూపొందించింద‌న్నారు. శ్రీమాన్ తాళ్ళపాక అన్నమయ్య తన కీర్తనలతో స్వామి వారికి లాలి పాడితే , వెంగమాంబ తన కృతులతో స్వామివారికి ముత్యాల హారతి సమర్పించారని చెప్పారు. ఆమె తన జీవితాన్ని స్వామివారికి అంకితం చేసి, స‌జీవ స‌మాధి చెందార‌ని చెప్పారు. తిరుమ‌ల‌లో మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో నిత్యం భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు అందిస్తున్నామ‌న్నారు. వెంగ‌మాంబ ర‌చించిన ద్విప‌ద భాగ‌వ‌తాన్ని సంపూర్ణంగా భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌ని, ఆమె జ‌యంతి, వ‌ర్థంతి కార్య‌క్ర‌మాల‌ను మ‌రింత విస్తృతంగా నిర్వ‌హించాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు.

అంత‌కుముందు త‌రిగొండ శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యాన్ని ప‌రిశీలించి, ఆల‌యంలో నిర్వ‌హించే పూజ కార్య‌క్ర‌మాల‌పై అర్చ‌కుల‌తో స‌మీక్షించారు. అనంత‌రం ఆల‌యంలోని శాస‌నాన్ని ప‌రిశీలించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతి, అన్న‌మ‌య్య‌, వెంగ‌మాంబ ప్రాజెక్టుల సంచాల‌కులు శ్రీ ఆకెళ్ళ విభీష‌ణ శ‌ర్మ‌, సూప‌రింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.