TEPPOTSAVAM AND SURYA PUJOTSAVAM OF NAGALAPURAM TEMPLE_ మార్చి 24 నుండి 28వ తేదీ వరకు శ్రీ వేదనారాయణస్వామివారి సూర్యపూజోత్సవం, తెప్పోత్సవాలు

Tirupati, 22 Mar. 19: TTD JEO Sri B Lakshmikantham on Friday evening released the wall posters and booklets of Surya Pujotsavam and Teppotsavam of Sri Veda Narayana Swamy Temple of Nagalapuram in Sri Kodanda Rama Swamy Temple in Tirupati.

TTD plans to grandly celebrate the Teppotsavam and Surya Pujotsavam festivals at its local temple Sri Vedanarayana Swamy Temple of Nagulapuram from March 24 to 28.

Legends say that on the three days of Surya Pujyotsava sun rays will touch feet, body and head of the idol of Vedanarayana from the 630 feet distant Rajagopuram. During the festival snapana Thirumanjanam is performed to the deity and consorts and Veedhi utsavam at nights.

A five day annual Teppotsavam us also performed from March 24 th and the artists of Annamacharya project will present Bhakti sangeet and religious discourse every day and enthrall the devotees.

Temple DyEO Sri Sridhar, SE Sri Ramesh Reddy, VGO Sri Ashok Kumar Goud, AEO Sri Tirumalaiah, Temple Suptd Sri Ramesh and others were present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 24 నుండి 28వ తేదీ వరకు శ్రీ వేదనారాయణస్వామివారి సూర్యపూజోత్సవం, తెప్పోత్సవాలు

తిరుప‌తి, 2019 మార్చి 22: టిటిడికి అనుబంధంగా నాగలాపురంలోని శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారి ఆల‌యంలో వార్షిక సూర్యపూజ మహోత్సవం, తెప్పోత్సవాలు మార్చి 24 నుండి 28వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.

శ్రీమహావిష్ణువు మత్స్యావతార రూపంలో సంవత్సరాల పాటు యుద్ధం చేసి వచ్చినందున, స్వామి దివ్య శరీరానికి వెచ్చదనం కలిగించేందుకు సూర్య భగవానుడు తన కిరణాలను స్వామివారి మీద ప్రసరింపచేయడమే సూర్యపూజోత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన రాజగోపురం నుండి 630 అడుగుల దూరంలో గల మూలవిరాట్టుపై సూర్యకిరణాలు నేరుగా ప్రసరిస్తాయి. మొదటి రోజు స్వామివారి పాదాలపై, రెండో రోజు నాభిపైన, మూడో రోజు స్వామి శిరస్సుపై సూర్యకిరణాలు ప్రసరించి స్వామి దివ్యరూపాన్ని మరింత తేజోవంతం చేస్తాయి.

మార్చి 24 నుండి 28వ తేదీ వరకు జరుగనున్న వార్షిక సూర్యపూజ మహోత్సవం, తెప్పోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 9.00 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు భక్తులకు సూర్యపూజ దర్శనం ఉంటుంది. రాత్రి 7.30 నుండి 9.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరుగనుంది.

మార్చి 24 నుండి తెప్పోత్సవాలు :

శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మార్చి 24 నుండి 28వ తేదీ వరకు ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు తెప్పోత్పవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణస్వామివారు, రెండవ రోజు గోదాదేవి సమేత వేదనారాయణ స్వామివారు, మూడవ రోజు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, నాల్గవ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేదనారాయణస్వామివారు, ఐదవ రోజు శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణస్వామివారు తెప్పలపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. తెప్పోత్సవాల అనంతరం మొదటి మూడు రోజులు స్వామి, అమ్మవార్ల (తిరుచ్చి) తిరువీధి ఉత్సవం, నాలుగో రోజు ముత్యపుపందిరి వాహనం, ఐదవ రోజు పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ సాయంత్రం ఆధ్యాత్మిక, భక్తి, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.