JEO INSPECTS VISHNU NIVASAM AND CHOULTARIES_ విష్ణునివాసం, చౌల్ట్రీల్లో జెఈవో త‌నిఖీలు

Tirupati, 22 Mar. 19: TTD Joint Executive Officer Sri B Lakshmi Kantham inspected the Vishnu Nivasam rest house and Sri Govindaraja choultries 1,2 on Friday morning.

Speaking to media later the JEO said all-out efforts were to ensure easy allocation of rooms with all amenities and in clean condition to waiting for devotees at both Vishnu Nivasam and the choultries.

He said TTD has rolled out CCTV, dsmd infrastructure to provide foolproof security besides hygiene, greenery, power and clean drinking water in the rest houses.

The JEO said at the choultries also bed sheets, pillow covers were changed frequently and chlorinated water stored in overhead tanks under the daily supervision of the officials. The rooms and corridors of the choultries are being repaired to give best ambience and comforts to devotees.

Earlier the JEO inspected the rooms, drinking water systems, locker facility, primary health centre, room allocation offices. Sarva darshan time slot token issue counters etc. at the Vishnu Nivasam.

TTD SE-1 Sri Ramesh Reddy, DyEO Smt Lakshmi Narasamma, DE Sri Ravishankar Reddy, AEO Smt Geeta, and Addl Health Officer Dr Sunil Kumar, AVSO Sri Rajesh and others participated in JEO inspection visit.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

విష్ణునివాసం, చౌల్ట్రీల్లో జెఈవో త‌నిఖీలు

తిరుప‌తి, 2019 మార్చి 22: తిరుప‌తిలోని విష్ణునివాసం యాత్రికుల వ‌స‌తి స‌ముదాయం, శ్రీ గోవింద‌రాజ‌ 2, 3వ స‌త్రాల్లో శుక్ర‌వారం టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం త‌నిఖీలు నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ విష్ణునివాసం, స‌త్రాల్లో యాత్రికుల‌కు సులువుగా గ‌దులు ల‌భ్య‌మ‌య్యేలా, గ‌దుల్లో అన్ని సౌక‌ర్యాలు ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని తెలిపారు. మెరుగైన ప‌రిశుభ్ర‌త చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని, విద్యుత్‌, తాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామ‌న్నారు. సిసి టివిలతోపాటు, డిఎఫ్ఎండి ఏర్పాటుచేసి భ‌ద్ర‌త‌చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు. ప‌చ్చ‌ద‌నం పెంచి ఆహ్లాదంగా తీర్చిదిద్దుతామ‌ని వివ‌రించారు. ఓవ‌ర్‌హెడ్ ట్యాంక్‌లో క్లోరినేష‌న్ చేస్తామ‌న్నారు. సత్రాల్లో బెడ్‌షీట్లు, దిండుక‌వ‌ర్లు త‌క్ష‌ణం మారుస్తామ‌ని, ఇక్క‌డ మెరుగైన పారిశుద్ధ్యం కోసం సంబంధిత అధికారులు నిత్యం ప‌ర్య‌వేక్ష‌ణ చేప‌ట్టేలా ఆదేశించామ‌ని తెలిపారు. స‌త్రాల్లో అవ‌స‌ర‌మైన మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టి భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా తీర్చిదిద్దుతామ‌న్నారు.

అంత‌కుముందు విష్ణునివాసం, స‌త్రాల్లోని గ‌దులను, తాగునీటి వ‌స‌తిని, డాగ్ స్క్వాడ్‌, లాక‌ర్ల స‌దుపాయం, ప్రథ‌మ చికిత్స కేంద్రాలు, గ‌దుల కేటాయింపు కేంద్రాలు, స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలను జెఈవో ప‌రిశీలించారు.

జెఈవో వెంట టిటిడి ఎస్ఇ-1 శ్రీ ర‌మేష్‌రెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ల‌క్ష్మీన‌ర‌స‌మ్మ‌, డిఇ శ్రీ ర‌విశంక‌ర్‌రెడ్డి, ఏఈవో శ్రీమ‌తి పి.గీత‌, అద‌న‌పు ఆరోగ్య‌శాఖాధికారి డా..సునీల్‌కుమార్‌, ఏవిఎస్‌వో శ్రీ రాజేష్ త‌దిత‌రులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.