UGADI ASTHANAM ON APRIL 6 AND KOIL ALWAR TIRUMANJANAM ON APRIL 3 IN SRIVARI TEMPLE_ ఏప్రిల్ 6న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

Tirumala, 22 Mar. 19: TTD plans to grandly celebrate the Ugadi Asthanam event on April 6 inside the Srivari Temple, Tirumala.

As part of the event after daily rituals, Panchanga Sravana program heralding the advent of Sri Vikari Nama Samvatsaram will be conducted at the Bangaru vakili inside the Srivari temple.

The Agama pundits and Archakas and senior TTD officials will conduct Ugadi Asthanam after colourful rituals like new silk robes to moola Virat and utsava idols.

Ahead of Ugadi festival the TTD will perform the Koil Alwar Thirumanjanam event in the temple on April 2.

The TTD has cancelled daily Arjita sevas slated for the day in the Srivari temple.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఏప్రిల్ 6న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

తిరుమల 2019 మార్చి 22: ఏప్రిల్ 6వ తేదీ శ‌నివారం తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ వికారినామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని టిటిడి ఘనంగా నిర్వహించనుంది.

ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3.00 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థిని నిర్వహిస్తారు. అటు తరువాత తోమాలసేవను ఏకాంతంగా నిర్వహించిన అనంతరం బంగారు వాకిలి చెంత పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగనుంది.

ఉదయం 6.00 గంటలకు శ్రీదేవి భూదేవి ససేత శ్రీ మలయప్పస్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణను నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7.00 నుండి 9.00 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్థంభం చుట్టు ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. అటు తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణ కార్యక్రమం వీనులవిందుగా నిర్వహించనున్నారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలిలో ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొంటారు.

ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకొని ఏప్రిల్ 6వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవాలను టిటిడి రద్దు చేసింది.

శ్రీ‌వారి ఆల‌యంలో ఏప్రిల్ 2న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ‌వారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీ తెలుగు సంవత్సారాది శ్రీ వికారినామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆస్థానం నిర్వహించనుండడంతో ఏప్రిల్ 2న‌ మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం అత్యంత వైభవంగా టిటిడి నిర్వహించనుంది.

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ, ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మూెత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా ఉదయం 6.00 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలంతో శుద్ధి కార్యక్రమాన్ని ఆలయ సిబ్బంది అత్యంత పవిత్ర కార్యక్రమంగా ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తారు.

తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 12.00 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.