TEPPOTSAVAMS CONCLUDES ON A GRAND NOTE IN TIRUMALA _ ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు

Tirumala, 9 Mar. 20: The annual five-day Teppotsavams in Tirumala came to a grand end with the Malayappa, Sridevi and Bhudevi taking seven rounds on the finely decked float on the auspicious day of Magha Pournami on Monday.

The float festival which began on Magha Ekadasi concluded on the full moon day. The beauty of deities on the float enhanced with the rays of the moon falling on the float yielding out a bright shine much to the amusement of devotees who thronged to witness the grandeur of the float festival.

TTD EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy and others were also present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు
 
తిరుమల, 2020 మార్చి 09: తిరుమలలో 5 రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తె‌ప్ప‌పై విహ‌రించి భక్తులకు కనువిందు చేశారు.
 
ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటలకు విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీభూ సమేతంగా శ్రీమలయప్పస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఏడుసార్లు విహరించి భక్తులను క‌టాక్షించారు.
 
ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.