TEPPOTSAVAMS IN KRT _ వైభవంగా శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ప్రారంభం

TIRUPATI, 14 APRIL 2022: The annual Teppotsavams commenced in Sri Kodanda Rama Swamy temple on Thursday.

Sri Sita Rama Lakshmana utsava murties reached Ramachandra Pushkarini and Teppotsavam was performed in five rounds on first day.

Temple DyEO Smt Nagaratna, AEO Sri Durgaraju and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

వైభవంగా శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2022 ఏప్రిల్ 14: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి తెప్పోత్సవాలు గురువారం శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.

శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను రామచంద్ర పుష్కరిణికి వేంచేపు చేశారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు తెప్పోత్సవం నిర్వహించారు. విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతారామలక్ష్మణులు ఆశీనులై ఐదుచుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించారు.

ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగ‌ర‌త్న‌, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం‌, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.