TIRU NAKSHATRAMS OF ARDENT DEVOTEES IN NOVEMBER _ నవంబరు నెలలో మహనీయుల తిరు నక్షత్రోత్సవాలు
Tirumala, 03 November 2024: Besides observing several festivals dedicated to Sri Venkateswara Swamy in Tirumala all through the year, the Tiru Nakshatrotsavams of ardent devotees of Srivaru are also equally observed with religious fervour every year.
As such, in the month of November several such events are lined up. Each devotee is being revered till today even after centuries for their selfless contributions in the services of Srivaru.
On Sunday, November 03, the Tirumala Nambi Sattumora was observed. This great Sri Vaishnavaite devotee is revered for pioneering Theertha Kainkaryam in Tirumala. There is a temple dedicated to Sri Tirumala Nambi on South Mada Street.
On November 06, the Sattumora of Sri Manawala Mahamuni is there. It is believed that Manavala Mahamuni is the incarnation of Sri Ramanujacharya in 14th Century.
While on November 09, the Tiru Nakshatram of several prominent sages and Sri Vaishnavaite devotees are lined up including Atri Maharshi, Sri Pillailokacharya Varsha, Sri Poigai Alwar, Sri Pudattalwar, besides the Sattumora of Sri Vedanta Desika.
On November 10 the Varsha Tiru Nakshatram of Peyalwar, November 11, Sri Yajnavalkya Jayanti are scheduled.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నవంబరు నెలలో మహనీయుల తిరు నక్షత్రోత్సవాలు
తిరుమల, 2024 నవంబరు 03: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సంవత్సరం పొడవునా అనేక ఉత్సవాలు నిర్వహించడమే కాకుండా, శ్రీవారి పరమ భక్తుల తిరు నక్షత్రోత్సవాలు కూడా టీటీడీ ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగా నవంబరు 3వ తేదీ ఆదివారం నాడు తిరుమల నంబి శాత్తుమొర వైభవంగా జరిగింది. శ్రీ వైష్ణవ భక్తుడైన తిరుమలనంబి తిరుమలలో తీర్థ కైంకర్యాన్ని ప్రారంభించారు. శ్రీవారి ఆలయం దక్షిణ మాడ వీధిలో శ్రీ తిరుమల నంబి ఆలయం కూడా ఉంది.
శ్రీ రామానుజాచార్యుల అంశతో జన్మించిన శ్రీ మనవాళ మహాముని శాత్తుమొర నవంబరు 6న జరగనుంది.
నవంబరు 9న అత్రి మహర్షి, శ్రీ పిళ్ళైలోకాచార్య, శ్రీ పోయిగై ఆళ్వార్, శ్రీ భూదత్తాళ్వార్ల తిరునక్షత్రోత్సవాలతో పాటు, శ్రీ వేదాంత దేశికాచార్య శాత్తుమోరతో కూడా జరుగనుంది.
నవంబరు 10న శ్రీ పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, నవంబరు 11న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి జరగనున్నాయి .
టీటీడీ ముఖ్య పౌరసంబంధాల అధికారి జారీ చేశారు