GANAPATI HOMAM ENTERS DAY 2 _ శ్రీ కపిలేశ్వరాలయంలో గణపతి హోమం

Tirupati, 03 November 2024: The three-day Ganapati homam as a part of the month-long Homa Mahotsavams entered day two on Sunday in Kapileswara Swamy temple.

In the evening Sahasra Namarchana, Deeparadhana, Mantra Pushpam will be rendered.

DyEO Sri Devendra Babu, other staff, Grihasta devotees were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో గణపతి హోమం

తిరుపతి, 2024 న‌వంబ‌రు 03: తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం గణపతి హోమం జ‌రిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే.

ఆలయ ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ వినాయకస్వామి ప్రతిమకు విశేష అలంకరణ చేపట్టారు. ఉదయం 9 నుండి 12 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో అర్చక బృందం పూజ, జపం, గణపతి హోమం, లఘుపూర్ణాహుతి, నివేదన నిర్వహించారు. వినాయకుడికి ప్రీతిపాత్రమైన కుడుములు, నెయ్యి, అన్నం, అటుకులు, బెల్లం, అరటిపండ్లు తదితర అష్టద్రవ్యాలతో హోమం చేపట్టారు. ఇందులో 16 నామాలతో గణపతిని స్తుతించారు.

కాగా, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు జపం, హోమం, శ్రీ గణపతి సహస్రనామార్చన, నివేదన, విశేష దీపారాధన, మంత్రపుష్పం మరియు హారతి ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.