TIRUMALA IS PILGRIMAGE DESTINATION FOR VISHWA HINDUS _ విశ్వంలోని హిందువుల దర్శనీయ స్థానం తిరుమల

DEVOTEE-FRIENDLY ATMOSPHERE IN TIRUMALA-MAHA MP

TIRUMALA, 31 JULY 2022:  The arrangements by Tirumala Tirupati Devasthanams temple administration is devotee friendly for everyone thronging from across the country to have darshan of Sri Venkateswara, said Sri Sanjay Jadhav the Honourable MP from Parbhani, Maharastra.

Speaking at the Nada Neerajanam platform in Tirumala on Sunday, the MP said, a few days ago a devotee from Maharashtra made a video viral on social media saying that TTD security insulted for carrying Chatrapati Srivaji Maharaj idol in the car which is absolutely baseless. Being an internationally acclaimed place of pilgrimage for Hindus, every vehicle undergoes a security check at the Alipiri check post. As it is a rule with the TTD board not to carry the images or symbols or personalities or flags of political parties, other religious faiths, each vehicle is being checked. As a part of the routine check, the vehicle of the said pilgrim was also checked. After verifying that it was idol of Shravaji Maharaj, they left the vehicle. But the devotee made a video viral abusing the TTD board. But in reality, that was incorrect and urged people of Maharastra not to believe such false rumours and happily visit Tirumala to have darshan of Bhagavan Venkateswara Balaji”, he maintained.

HH Sri Sri Sri Ramakanthji Vyas Maharaj said after staying three days in Tirumala, it has been noticed that there are no disparities in Tirumala and the pilgrims from all the states across the country are being treated equally

The devotees who come from various places should honour the rules and regulations and co-operate with security check. I appeal to all the Maharashtrians not to fell prey to false propaganda and we all have to join hands to take forward Hindu Santana Dharma with devotion.

TTD EO Sri AV Dharma Reddy reiterated on Sunday that all idols and portraits considered worship worthy by Hindus like Sri Chhatrapati Shivaji, Sri Ramakrishna Paramahamsa, Sri Vivekananda etc. would be allowed in Tirumala.

He said a social media campaign that Sri Chhatrapati Shivaji Maharaj idol was not allowed to Tirumala was totally untrue and baseless.

The EO said with an objective to maintain the holiness and sanctity of Tirumala hill shrine TTD has decided not to allow idols or materials with, political and other non Hindu faiths into Tirumala.

He said due to a communication lapse, a controversy prevailed about Sri Chhatrapati Shivaji idol in a vehicle of a Maharashtra devotee a few days ago. However, the issue was resolved amicably and the devotee and his vehicle were permitted to proceed to Tirumala after a routine security check.

But the devotee made a hatred video which became viral on social media impacting on the sentiments of scores of Maharashtrians. We appeal to all not to believe such ruthless statements as we very well knew Chhatrapati Shivaji was one of the great Hindu Leaders and we have immense respect towards the great soul.

Earlier on Sunday morning, TTD board member Sri Milind Narwekar presented an idol of Sri Chhatrapati Shivaji idol to TTD EO at the laters camp office.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

విశ్వంలోని హిందువుల దర్శనీయ స్థానం తిరుమల

– తిరుమలలో భక్తులకు స్నేహపూర్వక వాతావరణం

– మహారాష్ట్ర ఎంపి శ్రీ సంజయ్ జాదవ్

తిరుమల, 2022 జులై 31: విశ్వంలోని హిందువులందరి దర్శనీయ స్థానంగా తిరుమల వర్ధిల్లుతోందని, శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టిటిడి ఇక్కడ స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తోందని మహారాష్ట్రలోని పర్బని ఎంపి శ్రీ సంజయ్ జాదవ్ పేర్కొన్నారు. ఆదివారం తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఎంపీ మాట్లాడుతూ కొద్దిరోజుల క్రితం మహారాష్ట్రకు చెందిన ఓ భక్తుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ప్రతిమను కారులో తీసుకొచ్చినందుకు అలిపిరి చెక్ పాయింట్ వద్ద టిటిడి సెక్యూరిటీ అవమానించారంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారిందన్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన హిందువుల పుణ్యక్షేత్రం కావడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద ప్రతి వాహనాన్ని భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తారని చెప్పారు. రాజకీయ పార్టీలు, ఇతర మత విశ్వాసాల చిత్రాలు, గుర్తులు, వ్యక్తుల చిత్రాలు, జెండాలు తీసుకెళ్లరాదని టిటిడి నిబంధనలు ఉన్నాయన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా, మహారాష్ట్ర యాత్రికుడి వాహనాన్ని కూడా తనిఖీ చేశారని, శ్రీ శివాజీ మహరాజ్ ప్రతిమ అని నిర్ధారించుకున్న తర్వాత వాహనాన్ని తిరుమలకు అనుమతించిననట్టు చెప్పారు. అయితే టిటిడి బోర్డును దూషిస్తూ ఓ భక్తుడు ఓ వీడియోను వైరల్ చేశారని, వాస్తవానికి ఇది సరికాదని, మహారాష్ట్ర ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. యాత్రికులు సంతోషంగా తిరుమలను సందర్శించాలని, శ్రీవారి సేవలో తరించాలని కోరారు.

శ్రీశ్రీశ్రీ రమాకాంత్‌జీ వ్యాస్ మహరాజ్ మాట్లాడుతూ తిరుమలలో మూడు రోజులు బస చేశామని, ఇక్కడ ఎలాంటి అసమానతలు లేవని, దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులను సమానంగా చూస్తున్నట్లు గుర్తించామని అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు నిబంధనలు పాటించి భద్రతా తనిఖీలకు సహకరించాలన్నారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని మహారాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. హిందూ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మనమందరం చేతులు కలపాలని కోరారు.

టిటిడి ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ హిందువులు పూజించే శ్రీ ఛత్రపతి శివాజీ, శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ వివేకానంద తదితర మహనీయుల ప్రతిమలు, చిత్రపటాలను తిరుమలకు అనుమతిస్తామని పునరుద్ఘాటించారు. శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తిరుమలకు అనుమతించడం లేదని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, నిరాధారమని అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు రాజకీయ, ఇతర హిందూయేతర విశ్వాసాలకు సంబంధించిన ప్రతిమలు, వస్తువులను అనుమతించకూడదని టిటిడి నిర్ణయించినట్లు ఈఓ తెలిపారు. కమ్యూనికేషన్ లోపం కారణంగా కొన్ని రోజుల క్రితం మహారాష్ట్ర భక్తుడి వాహనంలో శ్రీ ఛత్రపతి శివాజీ విగ్రహం గురించి వివాదం చెలరేగిందని ఆయన అన్నారు. అయితే సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారమైందని, సాధారణ భద్రతా తనిఖీల తర్వాత భక్తుడి వాహనాన్ని తిరుమలకు అనుమతించినట్టు చెప్పారు. కానీ సదరు భక్తుడు ప్రచారం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని, ఇది మహారాష్ట్రీయుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని అన్నారు. హైందవ మత ప్రతిష్టను కాపాడిన శ్రీ ఛత్రపతి శివాజీపై తమకు అపారమైన గౌరవం ఉందని, ఇలాంటి అవాస్తవ ప్రకటనలను నమ్మవద్దని ఆయన మహారాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు ఆదివారం ఉదయం టిటిడి బోర్డు సభ్యుడు శ్రీ మిలింద్ నర్వేకర్ తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో ఈవోకు శ్రీ ఛత్రపతి శివాజీ ప్రతిమను బహూకరించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.