GRAND ABHISHEKAM OF KSHETRAPALAKA IN TIRUMALA_ తిరుమలలో క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకం
Tirumala, 4 Mar. 19: On the occasion of Maha Shivaratri the traditional practice of Abhisekam was grandly performed for Rudra in form of Kshetrapalaka ner Gogargh dam in Tirumala on today morning.
Priests and TTD officials from Srivari temple descended at GoGarbham this morning at the Kshetrapalaka rock spot and offered Naivedyam to the deity after solemn abhisekam with milk, curd, aromatic water, and honey and coconut water.
DyEO of Srivari Temple Sri Harindranath, Parpatyedhar Sri Shashidar and other temple officials and devotees participated.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
తిరుమలలో క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకం
మార్చి 04, తిరుమల 2019: తిరుమలలోని గోగర్భం సమీపంలో గల రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి సోమవారం నాడు వేడుకగా అభిషేకం జరిగింది. తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్న రుద్రునికి మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకున్నారు. పాలు, పెరుగు, చందనం, పన్నీరు, కొబ్బరినీళ్లు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత నైవేద్యం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, పార్ పత్తేదార్ శ్రీ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.