TIRUMALA JEO REVIEWS ON RENOVATION WORKS OF POTU_ పోటు ఆధునీకరణపై తిరుమల జెఈవో సమీక్ష

Tirupati, 7 December 2017: Tirumala JEO Sri KS Sreenivasa Raju on Thursday reviewed with Engineering and Potu officials on the ongoing renovation works for the modernisation of temple kitchen in Tirumala.

The review meeting was held in the administrative building in Tirupati. Speaking on this occasion, the JEO said, With an aim to increase the quantity of laddus matching the demand from the pilgrims, Tirumala temple kitchen is soon getting transformed with necessary improvements in Tirumala. He also instructed the engineering wing to come out with an action plan on the machinery and the equipment to prepare sugar syrup and boondi to prepare additional laddus. “The machinery should be utilised by best possible means and a DyEE cadre officer should be allotted for its maintenance exclusively”, he added.

The JEO also instructed the temple and potu wing officials to assess the manpower requirement for the preparation of additional laddus which will be in a few months time.

FACAO Sri Balaji, CE Sri Chandra Sekhar Reddy, SE II Sri Ramachandra Reddy, DyEOs Sri Kodanda Rama Rao, Sri Venugopal, AEO Potu Sri Ashok, padu potu workers were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

పోటు ఆధునీకరణపై తిరుమల జెఈవో సమీక్ష

డిసెంబరు 07, తిరుమల, 2017: శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సంఖ్యకు తగినట్టుగా లడ్డూ ప్రసాదాల తయారు చేసేందుకు వీలుగా పోటును ఆధునీకరించడంపై తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు గురువారం ఇంజినీరింగ్‌, పోటు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో ఈ సమావేశం జరిగింది.

భవిష్యత్తులో శ్రీవారి లడ్డూల ఉత్పత్తిని పెంచేందుకు కావాల్సిన యంత్రసామగ్రి, మానవవనరులు, పడిపోటు, అదనపు పోటుపై జెఈవో సమీక్షించారు. సామర్థ్యానికి తగినట్టుగా ఆధునిక యంత్రాలను ఎలా ఉపయోగించుకోవాలి, నిర్వహణ లోపాలు లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలపై జెఈవో చర్చించారు.

ఈ సమావేశంలో టిటిడి ఎఫ్‌ఏ, సిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ కోదండరామారావు, శ్రీ వేణుగోపాల్‌, పోటు పేష్కార్‌ శ్రీ అశోక్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.