TTD CALENDARS AND DIARIES NOW IN ON-LINE_ ఆన్‌లైన్‌లో టిటిడి 2018 క్యాలెండర్లు, డైరీలు బుకింగ్‌కు అవకాశం : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 7 December 2017: To facilitate pilgrims to book TTD Calendars and Diaries through on-line, the temple management opened up the facility in its official website on Thursdayevening.

Launching the new facility TTD EO Sri Anil Kumar Singhal said, with the help of postal department TTD has launched this facility on December 7. Now the pilgrims can present the TTD calendar and Diary to their kin and friends who are present across the country as new year gift.

“The devotees have to log in to the TTD website, ttdsevaonline.com and click on the “publications” key and order the calendars and diaries through credit card or debit card. They will get the acknowledgement of the order number in the form of a SMS. The same will be informed to postal department along with the details of the pilgrim for the delivery of order. In turn the postal department delivery the calendars and diaries and sends the tracking number to devotee. The devotees have to pay the postal delivery charges in addition to MRP of diaries and calendars”, the EO explained.

Tirupati JEO Sri P Bhaskar, FACAO Sri Balaji, Postal Department Superintendent Sri K Srikumar, PRO and Saleswing department head, Dr T Ravi, TCS experts Sri Bhimshekar, Sri Satya were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

ఆన్‌లైన్‌లో టిటిడి 2018 క్యాలెండర్లు, డైరీలు బుకింగ్‌కు అవకాశం : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

డిసెంబరు 07, తిరుపతి, 2017: టిటిడి ప్రతి ఏడాదీ ప్రతిష్టాత్మకంగా ముద్రిస్తున్న క్యాలెండర్లు, డైరీలను మొదటిసారిగా భక్తులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే అవకాశం కల్పించామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల ఈవో కార్యాలయంలో గురువారం 2018 క్యాలెండర్లు, డైరీల ఆన్‌లైన్‌ బుకింగ్‌ను ఈవో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న టిటిడి సమాచార కేంద్రాలు, ముఖ్య నగరాల్లో క్యాలెండర్లు, డైరీలను ఇప్పటికే అందుబాటులో ఉంచామన్నారు. పలువురు భక్తుల కోరిక మేరకు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సౌకర్యం కల్పించామన్నారు. టిటిడి క్యాలెండర్లు, డైరీలను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసి నూతన సంవత్సరం కానుకగా తమ బంధువులకు, స్నేహితులకు పోస్టల్‌ ద్వారా పంపే అవకాశాన్ని భక్తులకు కల్పించామన్నారు. భక్తులు ttdsevaonline.com వెబ్‌సైట్‌లో ”పబ్లికేషన్స్‌”ను క్లిక్‌ చేసి డెబిట్‌కార్డు, క్రెడిట్‌ కార్డుల ద్వారా ఆర్డరు చేయవచ్చని తెలిపారు. నిర్ణీత వ్యవధిలో క్యాలెండర్లు, డైరీలు భక్తులకు చేరేలా పోస్టల్‌ శాఖ చర్యలు చేపట్టిందన్నారు. క్యాలెండర్‌, డైరీలను చేర్చినందుకు గాను ఎంఆర్‌పి ధరతోపాటు పోస్టల్‌ చార్జీలను భక్తులు చెల్లించాల్సి ఉంటుందని, లక్షలాది మంది భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈవో కోరారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, టిసిఎస్‌ ఐటి నిపుణులు శ్రీ భీమశేఖర్‌, శ్రీ సత్య, పోస్టల్‌ సూపరింటెండెంట్‌(ఆర్‌ఎంఎస్‌) శ్రీ కె.శ్రీకుమార్‌, అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ శ్రీ ఎం.డి.అబ్దుల్‌ ఖాదర్‌, ఆర్‌ఎంఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కె.కృష్ణ, పిఆర్‌వో శ్రీ వి.భాస్కర్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.