KOIL ALWAR TIRUMANJANAM ON DEC 26_ డిసెంబరు 26న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirumala, 7 December 2017: In connection with Vaikuntha Ekadasi on December 29, koil alwar tirumanjanam will be observed on December 26 in Tirumala temple.

Usually, this traditional temple cleansing festival is observed four times in a year before ugadi, anivara asthanam, annual brahmotsavams and vaikuntha ekadasi.

On this day, TTD has cancelled Astadala Pada Padmaradhana seva.

This religious fete will be observed between 6am and 11am and darshan to pilgrims commences only after 12 noon.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

డిసెంబరు 26న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

డిసెంబరు 07, తిరుమల, 2017: డిసెంబరు 29న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని డిసెంబరు 26వ తేదీ మంగళవారంనాడు శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది.

సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మూెత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఇందులోభాగంగా, మంగళవారంనాడు ఉదయం 6 నుండి 11 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా గర్భాలయం, ఉప ఆలయాలు, పోటును శుద్ధి చేస్తారు. ఆలయ సిబ్బంది అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక మహాయజ్ఞంలా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ తిరుమంజన ఉత్సవం కారణంగా అష్టదళ పాదపద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుండి సర్వదర్శనం ప్రారంభమవుతుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.