TIRUMALA SARE PROCESSION REACHES TIRUCHANOOR TEMPLE _ శ్రీ‌వారి ఆల‌యం నుండి శ్రీ పద్మావతి అమ్మవారికి సారె

Tirumala, 28 November 2022: The sacred Sare and ornaments of Srivari temple in Tirumala reached Tiruchanoor in connection with Panchami Theertham fete as part of the final day festivities of Karthika Brahmotsavams on Monday. 

TTD Chairman Sri YV Subba Reddy and the TTD EO Sri AV Dharma Reddy participated in the fete.

Earlier in Tirumala, at 2.30 am the saree along with Parimalam ( a mixture of Sri Churna, Kasturi, Turmeric, crystal karpooram, green leaves, sandal powder, sindhur and Kichiligadda) were paraded along the vimana Prakara and thereafter the Lakshmi icon in Sri Venkateswara idol chest was given Tirumanjanam in Ekantham.

The procession of Sare comprising Pattu Vastrams, Prasadam, Tulasi and other sacred materials took place on Mada streets and later was brought to Alipiri on foot by temple officials.

The holy procession reached Tiruchanoor via Komalamma Choultries, Sri Kodandaramaswami temple, Sri Govindarajaswami temple, Lakshmipuram circle, Shilparamam up to Pasupu Mandapam.

In this place, EO Sri AV Dharma Reddy presented the Sare and also the special jewel gift from Srivaru to Ammavaru on the occasion to JEO Sri Veerabrahmam at Alipiri.

TTD officials and devotees in large numbers were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారి ఆల‌యం నుండి శ్రీ పద్మావతి అమ్మవారికి సారె

తిరుమల, 2022 నవంబరు 28: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె స‌మ‌ర్పించారు.

ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు.

ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2.30 నుండి పరిమళాన్ని(నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమం) విమాన ప్రాకారంలో ఊరేగింపు చేప‌ట్టారు. అనంత‌రం శ్రీవారి వక్ష:స్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వ‌హించారు. ఆ త‌రువాత ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణంతో కూడిన సారె ఊరేగింపు మొదలైంది. ఈ సారెను గజాలపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించి అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకెళ్లారు. అక్క‌డినుండి కోమ‌ల‌మ్మ స‌త్రం, శ్రీ కోదండరామాలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, లక్ష్మీపురం సర్కిల్, శిల్పారామం నుండి తిరుచానూరు పసుపు మండపం మీదుగా ఆలయం వ‌ద్ద అమ్మ‌వారికి సారె స‌మ‌ర్పించారు.

ఆభ‌ర‌ణంతో కూడిన శ్రీ‌వారి సారెను అలిపిరి వ‌ద్ద ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి జెఈవో శ్రీ వీరబ్రహ్మంకు అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అధికారులు  పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.