TIRUMALA SHINES IN THE ILLUMINATION OF KARTHIKA DEEPOTSAVAM _ శ్రీవారి ఆలయంలో కన్నుల పండుగగా కార్తీక దీపోత్సవం

Tirumala, 7 December 2022: The hill shrine of Tirumala dazzled under the illumination of ghee-lit lamps as a part of Karthika Deepotsavam held here on Wednesday evening.

The entire temple premises starting from Main Entrance to Garbha Griham, Sub-Shrines, etc. have been lit with a galaxy of ghee-lit lamps.

Besides, the lamps were also lit in the traditional ”Mookullu” which was placed at all the important places including Sri Bedi Anjaneya Swamy, SriVaraha Swamy, Swamy Pushkarini, etc. apart from the sub-temples in the main shrine.

Meanwhile, TTD has cancelled Sahasra Deepalankara Sevas following this festival.

HH Tirumala Pedda Jeeyarr Swamy, EO Sri AV Dharma Reddy, JEO E &H Smt Sada Bhargavi, VGOs Sri Bali Reddy, Sri Giridhar, DyEO Sri Harindranath, and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

శ్రీవారి ఆలయంలో కన్నుల పండుగగా కార్తీక దీపోత్సవం
 
తిరుమల, 2022 డిసెంబర్ 07: తిరుమల శ్రీవారి అలయంలో బుధవారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం టిటిడి ఘనంగా నిర్వహించింది. కార్తీక పున్నమినాడు  సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం  కన్నుల   పండుగగా జరిగింది.
 
ఇందులో భాగంగా సాయంత్రం 5 నుండి రాత్రి 8.30 గంటల వరకు అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో  మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం ప్రక్కనవున్న పరిమళంఅర దగ్గర 100 కొత్త మూకుళ్ళలో నేతి వత్తులతో దీపాలను వెలిగించారు. తదుపరి వీటిని ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు. ఆతర్వాత  గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణమండపం, సభఅర, తాళ్లపాకంఅర, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహస్వామి, విష్వక్సేనులు, చందనంఅర, పరిమళంఅర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి సుమారుగా 100 నేతిజ్యోతులను మంగళవాయిద్యల న‌డుమ‌ వేదమంత్రోచ్ఛారణలతో ఏర్పాటు చేశారు.  
 
ఈ కార్తీకదీపోత్సవంలో  ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి, జె ఈవో శ్రీమతి సదా భార్గవి,
విజివోలు శ్రీ బాల్ రెడ్డి, శ్రీ గిరిధర్, డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు,  పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.