TTD ALLOTS SEVA TICKETS THROUGH ONLINE DIP_ ఆధార్‌తో మరింత పారదర్శకంగా భక్తులకు సేవలు

TIRUMALA, JUNE 23: About 96,837 devotees registered for online quota of 10,710 premiere arjitha Seva tickets and the tickets were allotted to the devotees through online dip on Friday by temple management of TTD, said Tirumala JEO Sri KS Sreenivasa Raju.

Briefing the media in his camp office at Tirumala, the JEO said TTD has released 44,896 tickets on June 16 by 10am pertaining to various sevas performed inside the hill temple of Lord Venkateswara for the month of September. And the devotees are given time for a week to register for online Seva tickets till 10am of June 23.

He said, 96,837 pilgrims have registered online for Suprabhatam (6,985 tickets) Thomala and Archana (90 each), Astadala Pada Padmaradhana seva (120) Vishesha pooja (2,300) and (1,125) Nija Pada Darshan tickets.The lucky dip for these premiere sevas, was done between 10 am and 12 noon on June 23. Information through SMS and e-mails has been immediately sent to the devotees who got the tickets in online dip. The payment gateway will be open till 12 noon of June 30 before which the devotees have to pay the amount for their tickets”, JEO added.

MORE TRANSPARENT SERVICES WITH AADHAAR-JEO

Tirumala JEO Sri KS Sreenivasa Raju urged the devotees to co-operate with TTD management to bring Aadhaar cards that for enjoying enhanced and transparent services in accommodation, Darshan, laddu Prasadam and other sevas and also keeping in view the security aspect.

He also said that from July 1 onwards the devotees should attach Aadhaar copy for break Darshan tickets and also have to bring Aadhaar card along with them for VIP break Darshan.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆధార్‌తో మరింత పారదర్శకంగా భక్తులకు సేవలు : తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

తిరుమల, 2017, జూన్‌ 23: శ్రీవారి దర్శనం, బస, లడ్డూ ప్రసాదం తదితర సేవల్లో మరింత పారదర్శకత పెంచేందుకు, భద్రతాపరమైన ఇబ్బందులు రాకుండా చూసేందుకు భక్తులు ఆధార్‌ను వినియోగించి టిటిడి యాజమాన్యానికి సహకరించాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు విజ్ఞప్తి చేశారు. తిరుమలలో జులై 1వ తేదీ నుంచి బ్రేక్‌ దర్శనం కోసం ఆధార్‌ కార్డు జెరాక్స్‌ కాపీని జత చేయాలని, బ్రేక్‌ దర్శన సమయంలో భక్తులు ఆధార్‌ను వెంట తీసుకురావాలని కోరారు. తిరుమలలోని జెఈవో క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఈవో సూచనల మేరకు ఇటీవల శ్రీవారి ఆలయంలోని వెండివాకిలి వద్ద చేపట్టిన స్వల్పమార్పులు సత్ఫలితాలను ఇస్తున్నాయని, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వైకుంఠం క్యూకాంప్లెక్సు-1లో అదనంగా మరుగుదొడ్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాదాలను పెంచుతున్నట్టు వివరించారు. వేసవి రద్దీ సమయంలో అధికారులు సమన్వయం చేసుకుని విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టారని, ఇదే స్ఫూర్తితో రానున్న శ్రీవారి బ్రహ్మూెత్సవాలకు ముందస్తుగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. గత బ్రహ్మూెత్సవాల్లో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపడతామన్నారు. తిరుమలకు విచ్చేసే భక్తుల్లో మరింతగా ఆధ్యాత్మిక భావన పెంచేందుకు లైటింగ్‌, పచ్చదనం పెంచుతామన్నారు.

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు ఆన్‌లైన్‌లో లక్కీడిప్‌ :

లక్కీడిప్‌లో ఉంచిన 10,710 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లకు గాను 96,837 మంది భక్తులు నమోదు చేసుకున్నారని జెఈవో తెలిపారు. శుక్రవారం ఆన్‌లైన్‌లో లక్కీడిప్‌ తీశామని, టికెట్లు పొందిన భక్తులందరికీ ఎస్‌ఎంఎస్‌, ఈ మెయిల్‌ ద్వారా సమాచారాన్ని తెలియజేశామని వెల్లడించారు. ఆన్‌లైన్‌ డిప్‌లో టికెట్లు ఖరారు అయిన భక్తులు జూన్‌ 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు టిటిడి వెబ్‌సైట్‌ పేమెంట్‌ గేట్‌ వే ద్వారా నగదు చెల్లించవచ్చన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.