TAKE PART IN SVV – TIRUPATI JEO INVITED DENIZENS OF VIJAYAWADA_ శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలను జయప్రదం చేయండి

Vijayawada, 23 June 2017: Sri Venkateswara Vaibhavotsavams will be organised from July 2-9 in a big way in PWD Grounds in Vijayawada and locals should take part in large numbers, invited Tirupati JEO Sri P Bhaskar.

The JEO released the posters and Handouts related to the event in the grounds here on Friday. Later speaking to media persons he said, to enable the common devotee to witness all the arjitha sevas that are being performed in Tirumala temple, sitting at their door steps TTD has designed Sri Venkateswara Vaibhavotsavams and so far conducted them at Vizag, Guntur, Hyderabad and Mumbai.

“This religious program was a huge success wherever we conducted it. The replica temple will be constructed here and the rituals starting from dawn to desk will be observed here every day akin to Tirumala” he maintained.

Meanwhile every day commences with Suprabhata Seva by 6:30amand concludes with Ekanta Seva by 9pm with Thomala, Archana, Koluvu, Nivedana, Sattumora in between.

Apart from the daily routine, there will be Astadala Pada Padmaradhana Seva on July 4, Sahasra Kalasabhishekam on July 5, Tiruppavada on July 6, Abhishekam on July 7 Vasanthotsavam and Srinivasa Kalyanam on July 8 and concludes with Pushpayagam on July 9. Besides there will be religious discourses with spiritual persons on July 2 and 3 between 5pm and 8pm.

SE Sri Sudhakar Rao, EE Sri Nageswara Rao, PRO Dr T Ravi, Kalyanotsavam Project Special Officer Sri Prabhakar Rao, donors Sri Harsha, Sri V Prabhakar Reddy, TTD EX Board Member Sri Bhanuprakash Reddy were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలను జయప్రదం చేయండి : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

విజయవాడలో గోడపత్రికలు, కరపత్రాలు ఆవిష్కరణ

విజయవాడ, 2017, జూన్‌ 23: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలను జులై 2 నుంచి 9వ తేదీ వరకు విజయవాడలో నిర్వహిస్తామని, భక్తులందరూ విచ్చేసి జయప్రదం చేయాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ కోరారు. విజయవాడలోని పిడబ్ల్యుడి మైదానాల్లో శుక్రవారం శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల గోడపత్రికలు, కరపత్రాలను జెఈవో ఆవిష్కరించారు. జెండా ఊపి ధర్మప్రచార రథాన్ని ప్రారంభించారు.

అనంతరం జెఈవో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారు కొలువైన తిరుమల ఆలయంలో రోజువారీ నిర్వహించే సేవలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా టిటిడి పలు ప్రాంతాల్లో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలను నిర్వహిస్తోందన్నారు. విజయవాడ, పరిసర ప్రాంతాల భక్తులకు ఇది ఒక సువర్ణావకాశమని, పెద్ద సంఖ్యలో విచ్చేసి శ్రీవారి సేవల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఇప్పటివరకు విశాఖపట్నం, గుంటూరు, ముంబయి, హైదరాబాద్‌ ప్రాంతాల్లో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలను నిర్వహించినట్టు తెలిపారు. అన్ని చోట్లా లక్షలాది మంది భక్తులు విచ్చేసి శ్రీనివాసుని సేవలను తిలకించి తరించారని చెప్పారు.

ఈ ఉత్సవాల కోసం పిడబ్ల్యుడి మైదానాల్లో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటుచేసి ఉదయం 6.30 గంటలకు సుప్రభాతంతో ప్రారంభించి రాత్రి 9.00 గంటలకు ఏకాంత సేవ వరకు కైంకర్యాలు నిర్వహిస్తామని జెఈవో తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 6.30 గంటలకు సుప్రభాతం, ఉదయం 7 నుంచి 8 గంటల వరకు తోమాలసేవ, కొలువు, ఉదయం 8 నుంచి 8.45 గంటల వరకు అర్చన, ఉదయం 8.45 నుంచి 9 గంటల వరకు నివేదన, శాత్తుమొర, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ప్రత్యేక సేవ, ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు రెండో నివేదన చేపడతామన్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తామని వెల్లడించారు. సాయంత్రం 5.45 నుంచి 6.30 గంటల వరకు సహస్రదీపాలంకార సేవ, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.15 గంటల వరకు వీధి ఉత్సవం, రాత్రి 7.15 నుంచి 8.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు, రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు ఏకాంతసేవ నిర్వహిస్తామని తెలియజేశారు.

జులై 2, 3వ తేదీల్లో సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలతో ధార్మికోపన్యాసాలు నిర్వహిమని జెఈవో తెలిపారు. ప్రత్యేక సేవల్లో భాగంగా జులై 4న అష్టదళ పాదపద్మారాధన, జులై 5న సహస్రకలశాభిషేకం, జులై 6న తిరుప్పావడ, జులై 7న అభిషేకం, జులై 8న వసంతోత్సవం, శ్రీనివాస కల్యాణం, జులై 9న పుష్పయాగం నిర్వహిస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఎస్‌ఇ శ్రీ సుధాకర్‌రావు, ఇఇ శ్రీ నాగేశ్వరరావు, శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ప్రభాకరరావు, దాతలు శ్రీ హర్ష, శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.