TTD ANNOUNCES RS 25 LAKH EX-GRATIA TO FAMILIES OF VICTIMS OF SARVA DARSHAN TOKENS STAMPEDE INCIDENT _ సర్వదర్శన టోకెన్ల తొక్కిసలాట సంఘటన మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్గ్రేషియా
FREE EDUCATION FOR THEIR IN TTD EDUCATIONAL INSTITUTIONS – TTD CHAIRMAN
Tirumala, 10 January 2025: The TTD board has condoled the death of six devotees who died in the stampede at Bairagi Patteda and Vishnu Nivasam counters on the night of 8th January in Tirupati set up by TTD as part of providing Vaikuntha Ekadashi Vaikuntha Dwara darshan to Srivari devotees.
The TTD board held an emergency meeting on Friday evening at the Annamaiah Bhavan in Tirumala.
In the subsequent media conference, TTD Chairman Sri. BR Naidu said that the incident happened on Wednesday night has shocked everyone. ”We all pray for the peace of the holy souls of those who died in this unfortunate incident”, he said.
As per the instructions of Hon’ble Chief Minister Sri Nara Chandrababu Naidu, we have decided to give Rs.25 lakhs as ex-gratia to the families of those who died, Rs.5 lakh to those seriously injured and Rs.2 lakhs to those undergoing treatment.
Similarly, our board has decided to provide free education to the children of the deceased in TTD educational institutions, the Chairman maintained.
TTD board members Smt Vemireddy Prashanthi Reddy, Smt Suchitra Ella announced Rs.10 lakhs each while Sri. M S Raju Rs. 3 lakh as personal financial assistance to the family members of the deceased, said the TTD Chairman.
TTD EO Sri J Syamala Rao, Additional EO Sri Ch Venkaiah Chowdary, other board members and officials participated in this meeting.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సర్వదర్శన టోకెన్ల తొక్కిసలాట సంఘటన మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్గ్రేషియా
వారి పిల్లలకు టీటీడీ విద్యా సంస్థల్లో ఉచిత విద్య – టీటీడీ చైర్మన్
తిరుమల, 2025 జనవరి 10: శ్రీవారి భక్తులకు వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించడంలో భాగంగా టీటీడీ తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో జనవరి 8వ తేది రాత్రి బైరాగి పట్టెడలోనూ మరియు విష్ణువాసం కౌంటర్లలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన ఆరుగురు భక్తులు మృతికి టీటీడీ బోర్డు సంతాపం తెలిపింది.
తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం సాయంత్రం అత్యవసర సమావేశాన్ని టిటిడి బోర్డు నిర్వహించింది.
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ శ్రీ బి ఆర్ నాయుడు మాట్లాడుతూ బుధవారం రాత్రి జరిగిన సంఘటన అందరినీ కలచి వేసింది అన్నారు. ఈ దురదృష్ట సంఘటనలో మృతి చెందిన వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని ఆ దేవదేవుని మనస్ఫూర్తిగా మేమందరం ప్రార్థిస్తున్నాం.
గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వాళ్లకి 05 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి 02 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చేందుకు నిర్ణయించాం.
అదేవిధంగా మృతుల పిల్లలకు ఉచిత విద్యను కూడా టిటిడి విద్యాసంస్థల్లో ఇవ్వడానికి మా బోర్డు నిర్ణయించింది.
టిటిడి బోర్డు సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మరియు శ్రీమతి సుచిత్ర ఎల్లా చెరో 10 లక్షలు, శ్రీ ఎమ్మెస్ రాజు 3 లక్షల రూపాయలు మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు, అని టీటీడీ చైర్మన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ శ్యామల రావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయబడింది