DEVOTEES THRONG TIRUMALA FOR VAIKUNTHA DWARA DARSHANAM _ వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు తరలివస్తున్న భక్తులు
వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు తరలివస్తున్న భక్తులు
ప్రమాదంలో గాయపడిన భక్తులకు స్వామి వారి దర్శనం
భక్తుల కోసం వైకుంఠ ద్వారం చాలా ముందుగానే తెరవబడుతుంది : అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి
ముక్కోటి ఏకాదశి పర్వదినాన వైకుంఠ ద్వార దర్శనం శుక్రవారం తిరుమలలో అత్యంత వైభవంగా జరిగింది.
తిరుమల 2025, జనవరి 10: ఈ రోజు తెల్లవారుజామున అభిషేకం తర్వాత శ్రీవారి దర్శనం ప్రారంభమైంది. అరగంట ముందుగానే భక్తులకు సంతృప్తికరంగా దర్శనం ప్రారంభించారు. గోవిందా.. గోవిందా అనే దివ్య సంకీర్తనలతో తిరుమల మొత్తం మారుమోగిపోయింది.
తొక్కిసలాటలో గాయపడ్డ వారికి శ్రీవారి ప్రత్యేక దర్శనం
గౌరవనీయులైన ఏపీ సీఎం శ్రీ ఎన్.చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శుక్రవారం తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికి టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ద్వార దర్శనం అనంతరం భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ తమకు అత్యంత కావాల్సిన ముక్కోటి దర్శనం కల్పించినందుకు సీఎం శ్రీ చంద్రబాబు, టీటీడీ చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
సామాన్య భక్తులకు ప్రాధాన్యత-అదనపు ఈవో
ఏపీ సీఎం శ్రీ ఎన్ చంద్ర బాబు నాయుడు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నామని తిరుమల అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం సామాన్య భక్తులకు సర్వ దర్శనం ప్రారంభించామన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి వైకుంఠ ద్వార దర్శనం కల్పించినట్లు తెలిపారు. ఈరోజు దర్శన స్లాట్‌ను బుక్ చేసుకున్న భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం కల్పిస్తామని హామీ ఇస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ శ్యామల రావు ఇతర అధికారులు పాల్గొన్నారు
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది