TTD BEEFS UP SECURITY IN ALIPIRI FOOTPATH _ తిరుమల నడక మార్గాల్లో మరింత పటిష్టమైన భద్రత ఏర్పాట్లు
APPEALS TO PARENTS TO TAKE CARE OF THEIR CHILDREN WHILE TREKKING FOOTPATHS-EO
500 CC CAMERAS TO BE INSTALLED AT THE VULNERABLE POINT
TIRUMALA, 12 AUGUST 2023: In the wake the heart-rending incident where in a six-year-old girl Lakshita, feared to have been died in a wild beast attack in the Alipiri Footpath route on Friday night, TTD beefed up security along with Forest and Police departments at all the vulnerable points along the footpath route.
TTD EO Sri AV Dharma Reddy held a high-level meeting with the TTD Forest, Vigilance and Security, Police and Forest Department officials at Gokulam Conference Hall on Saturday. After the meeting, briefing the media he said the incident was really shocking and expressed his deep felt condolences to the bereaved parents of the girl.
He said TTD will deliberate the possibilities of closing both the trekking path routes at 2pm – 3pm. CC camera footage had shown that victim Lakshita was alone quite away from her parents. TTD is committed to take stringent measures on the footpath to ensure against such wild beast attacks.
He said nearly 500 CC cameras are planned from the point of Gali Gopuram to Lakshmi Narasimha Swami temple and the forest department along with trained personnel has already kept two cages ready on 24×7 basis.
TTD EO also appealed to the parents who are trekking with children on footpaths to take additional precautions.
The TTD is already announcing the same all along the footpath routes without intervals, in the backdrop of incident of June 21 where in a 3-year old boy Kaushik from Kurnool district was attacked but miraculously saved.
The EO also said henceforth a group of 100 people will be allowed along with a security guard at this vulnerable point. Already there are 30 TTD security and 10 Forest guards are deployed at this point and we will enhance the personnel now”, he maintained.
He also said, TTD will initiate measures as soon as the Forest officials furnish the report in a few days time.
The Chief Conservator of Forest Sri Nageswara Rao said, cages and tranquilizers are already kept ready by the forest personnel and they will catch hold of the predator soon.
SE2 Sri Jagadeeshwar Reddy, ASP Sri Muniramaiah, DFO Sri Srinivasulu, VGOs Sri Manohar, Sri Bali Reddy, Sri Giridhar Rao, HO Dr Sridevi, forest and others were present.
తిరుమల నడక మార్గాల్లో మరింత పటిష్టమైన భద్రత ఏర్పాట్లు
– నడక దారుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి
– 500 సిసి కెమెరాలు ఏర్పాటు
– నడక మార్గాలను సత్వరంగా మూసి వేసేందుకు సాధ్యా సాధ్యాలను పరిశీలిస్తాం
– టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి
తిరుమల, 12 ఆగస్టు 2023: అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరింత పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం టీటీడీ, అటవీ పోలీస్ అధికారులతో ఈవో అత్యవసర సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, తిరుమల నడకదారిలో చిన్నారిపై చిరుత దాడి చాలా బాధాకరమన్నారు. నడకమార్గంలో 500 సిసి కెమెరాలు ఏర్పాటు చెస్తామని చెప్పారు. నడక మార్గానికి ఇరువైపులా కంచె ఏర్పాటు చేసేందుకు సమగ్ర నివేదిక అందించాలని డి.ఎఫ్.ఓ ను ఆదేశించారు.
చిరుత దాడి ఘటనపై సిసిఎఫ్ శ్రీ నాగేశ్వరరావు అధ్వర్యంలో సీన్ రీకనస్ట్రక్సన్ చెయ్యించి, చిరుతను బంధించడం కోసం బోన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
నడకదారిలో ఇప్పటికే 30 మంది టీటీడీ భద్రత సిబ్బంది, 10 మంది ఫారెస్ట్ సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. రెండు నడక మార్గాల్లోపారెస్టు, పోలీస్, టీటీడీ కలిసి మరింత ఎక్కువ మందితో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.
100 మంది భక్తుల గుంపుకు సేక్యూరిటి సిబ్బందిని ఏర్పాటు చేసి అనుమతించనున్నట్లు చెప్పారు. నడకదారులలో మధ్యాహ్నం 2-3 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతించే అంశాలపై సాధ్యా సాధ్యాలనుపరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా వుండేందుకు, త్వరలో అటవీ శాఖ అధికారులు అందించే నివేదిక ఆధారంగా పటిష్టమైన భద్రత చర్యలు చేపడతామని ఆయన వివరించారు.
చిన్నపిల్లలతో నడక మార్గాల్లో వచ్చే తల్లితండ్రులు వారిని జాగ్రత్తగా చూసుకోవాలని ఈవో విజ్ఞప్తి చేశారు.
సిసిఎఫ్ శ్రీ నాగేశ్వరరావు మాట్లాడుతూ, ట్రాంక్విలైజర్స్, బోన్లు వినియోగించి నడక మార్గాల్లో సంచరించే వన్య మృగాలను బంధించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో ఎస్ ఈ -2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, తిరుమల ఏఎస్ పి శ్రీ ముని రామయ్య, డిఇ ఎలక్ట్రికల్ శ్రీ రవి శంకర్ రెడ్డి, డిఎఫ్ ఓ శ్రీ శ్రీనివాసులు, విజివోలు శ్రీ బాల్ రెడ్డి, శ్రీ గిరిధర్, శ్రీ మనోహర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.