TTD BOARD CHIEF ATTENDS KRISHNASTAMI CELEBRATIONS AT ISKCON_ తిరుపతి ఇస్కాన్‌ ఆలయంలో అష్టగోపిక సమేత శ్రీకృష్ణస్వామివారిని దర్శించుకున్న టిటిడి ఛైర్మన్‌ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

Tirupati, 24 Aug. 19: TTD Trust Board Chairman Sri YV Subba Reddy on Saturday visited the Astagopika Radhadevi Sametha Sri Krishna (ISKCON) temple at Tirupati.

He was given warm welcome by the temple chief of Tirupati Branch Sri Revathi Raman Das.

Later the Chairman took part in the Special Puja event.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుపతి ఇస్కాన్‌ ఆలయంలో అష్టగోపిక సమేత శ్రీకృష్ణస్వామివారిని దర్శించుకున్న టిటిడి ఛైర్మన్‌ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

తిరుపతి, 2019 ఆగస్టు 24: గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని ఇస్కాన్‌ ఆలయంలోని అష్టగోపిక సమేత శ్రీకృష్ణస్వామివారిని టిటిడి ఛైర్మన్‌ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి శనివారం ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్‌కు ఆలయ ప్రెసిడెంట్‌ శ్రీ రేవతి రమణదాస్‌, ఇతర అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ అధికారులు శాలువ, స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందించి సన్మానించారు.

అనంతరం ఛైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమిని ప్రజలందురు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మధురలోని శ్రీకృష్ణస్వామివారి ఆలయం, తిరుపతిలోని ఇస్కాన్‌ ఆలయాలలో మాత్రమే రాధకృష్ణులు, అష్ట గోపికలు ఉన్నట్లు వివరించారు. ఇస్కాన్‌ ఆలయంలో రెండు రోజులుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సత్యవేడు శాసన సభ్యులు శ్రీ ఆదిమూలం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.