KOSUVARIPALLI PAVITROTSAVAMS_ సెప్టెంబరు 9 నుండి 11వ తేదీ వరకు కోసువారిపల్లి శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి ప‌విత్రోత్స‌వాలు

Tirupati, 24 Aug. 19: The annual three-day Pavitrotsavams in Sri Konetiraya Swamy temple at Kosuvaripalli will be observed from September 9 to 11 with Ankurarpanam on September 8.

This annual fete is usually performed to waive off the sins committed either knowingly or unknowingly by the religious or non-religious staffs and pilgrims during annual brahmotsavams.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబరు 9 నుండి 11వ తేదీ వరకు కోసువారిపల్లి శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి ప‌విత్రోత్స‌వాలు

తిరుపతి, 2019 ఆగస్టు 24: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలో వెలసిన శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి వార్షిక ప‌విత్రోత్స‌వాలు సెప్టెంబరు 9 నుండి 11వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. సెప్టెంబరు 8న సాయంత్రం 5.00 గంటలకు భాగ‌వ‌తారాధ‌న, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మ తాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సెప్టెంబరు 9వ తేదీ ఉదయం 7.30 నుండి 11.00 గంట‌ల వ‌ర‌కు చ‌తుష్టార్చాన‌, ప‌విత్ర ప్ర‌తిష్ఠ‌, సాయంత్రం 6.00 గంట‌ల‌కు భ‌గ‌వ‌తారాధ‌న‌ నిర్వహించనున్నారు. సెప్టెంబరు 10వ తేదీ ఉదయం 7.30 నుండి మ‌ధ్యాహ్రం 12.30 గంటల వరకు పవిత్ర సమర్పణ, సాయంత్రం 6.00 నుండి 9.00 గంటల వరకు పవిత్ర హోమం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 11న ఉదయం 8.00 నుండి మ‌ధ్యాహ్నం 1.00 గంటల వరకు స్వామి, అమ్మ‌వార్ల ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం, పవిత్ర వితరణ, మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. సాయంత్రం 6.00 గంటల నుండి స్వామి, అమ్మవార్ల వీధి ఉత్సవం నిర్వహించనున్నారు.

రూ. 200/- చెల్లించి గృహ‌స్తులు (ఇద్ద‌రు) ప‌విత్రోత్స‌ల్లో పాల్గొన‌వ‌చ్చు. గృహ‌స్తుల‌కు చివ‌రిరోజు ఒక ప‌విత్ర‌మాల‌ను, తీర్థ‌ప్ర‌సాదాల‌ను బ‌హుమానంగా అంద‌జేస్తారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.