TTD BOARD MEMBERS SWORN IN _ టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ మల్లాడి కృష్ణారావు, శ్రీ ఎపి.నందకుమార్ ప్రమాణస్వీకారం

TIRUMALA, 17 SEPTEMBER 2021: Sri Malladi Krishna Rao from Yanam and Sri AP Nanda Kumar, legislator of Anakattu of Vellore District in Tamilnadu took oath as members of TTD Trust Board.

 

TTD JEO Smt Sada Bhargavi administered oath with these two members inside Srivari temple on Friday. After darshan, they were rendered Vedasirvachanam at Ranganayakula Mandapam and presented with Theerth Prasadam.

 

Sri Krishna Rao thanked AP CM Sri YS Jaganmohan Reddy for giving an opportunity to serve the devotees in the abode of Sri Venkateswara Swamy while Sri Nanda Kumar thanked both AP CM as well Tamilnadu CM Sri MK Stalin for the divine opportunity to render service to the visiting pilgrims.

 

DyEOs Sri Ramesh Babu, Smt Sudha Rani were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ మల్లాడి కృష్ణారావు, శ్రీ ఎపి.నందకుమార్ ప్రమాణస్వీకారం

తిరుమల, 2021 సెప్టెంబ‌రు 17: యానాంకు చెందిన శ్రీ మల్లాడి కృష్ణారావు, తమిళనాడు రాష్ట్రం, వేలూరు జిల్లా అనకట్టు ఎమ్మెల్యే శ్రీ ఎపి.నందకుమార్ టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యులుగా శుక్రవారం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.

టిటిడి జెఈవో శ్రీమతి సదా భార్గవి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో స‌భ్యుల‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని జెఈఓ అందించారు.

అనంతరం ఆలయం వెలుపల శ్రీ మల్లాడి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ టిటిడి బోర్డులో తనకు మొదటిసారి అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి గారికి, టిటిడి చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. గతంలో తాను మంత్రిగా, ఎమ్మెల్యేగా సేవ చేశానని, అయితే టిటిడి ధర్మకర్తల మండలి సభ్యునిగా అవకాశం రావడం జీవితంలో మర్చిపోలేని ఘట్టమని ఆనందం వ్యక్తం చేశారు. సామాన్య భక్తునిగా స్వామివారి భక్తులకు సేవ చేస్తానని చెప్పారు.

ఆ తరువాత ఆలయం వెలుపల శ్రీ ఎపి.నందకుమార్ మీడియాతో మాట్లాడుతూ స్వామివారి అనుగ్రహంతో తనకు ధర్మకర్తల మండలి సభ్యునిగా అవకాశం వచ్చిందని, సాధారణ సేవకునిగా పనిచేస్తానని తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ స్టాలిన్ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
       
ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో  శ్రీ రమేష్ బాబు, డెప్యూటీ ఈవో (జనరల్) శ్రీమతి సుధారాణి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.  

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.