ADDITIONAL EO INSPECTS GOSADAN IN VIKARABAD _ వికారాబాద్‌లో గోస‌ద‌న్‌ను ప‌రిశీలించిన టిటిడి అద‌న‌పు ఈవో

TIRUMALA, 17 SEPTEMBER 2021:  To observe the techniques involved in Go Adharita Vyavasayam and Natural Farming, TTD Additional EO Sri AV Dharma Reddy visited Sowbhagya Gosadan located in Gattepalle Village in Vikarabad district of Telangana on Friday.

 

Natural Farming Expert Sri Vijay Ram, explained to him about the natural farming techniques being used to cultivate healthy crops and fruits in his land, shown him the Goshala with Desi Cow breeds and their protection measures. He also said, a donor Sri Murali has come forward to deploy Go Adharita Vyavasayam technique in his 300 acre land at Venkatagiri.

 

Former TTD Board member Sri Siva Kumar, Millet food expert Sri Rambabu, Natural Farming and Desi Cow promoter Sri Vasu, a philanthropist Sri Murali from Venkatagiri were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వికారాబాద్‌లో గోస‌ద‌న్‌ను ప‌రిశీలించిన టిటిడి అద‌న‌పు ఈవో

తిరుమల, 2021 సెప్టెంబ‌రు 17: గో ఆధారిత వ్య‌వ‌సాయం, ప్ర‌కృతి సాగులో అవ‌లంబిస్తున్న మెళ‌కువ‌ల‌ను ప‌రిశీలించేందుకు టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి శుక్ర‌వారం తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలోని గ‌ట్టేప‌ల్లిలో గ‌ల సౌభాగ్య గోస‌ద‌న్‌ను ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌కృతి సాగు నిపుణులైన శ్రీ విజ‌య‌రామ్ త‌న సాగుభూమిలో ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా ఆరోగ్య‌క‌ర‌మైన పంట‌లు, పండ్ల‌ను పండించే ప‌ద్ధ‌తుల‌ను అద‌న‌పు ఈవోకు వివ‌రించారు. గోశాల‌లో దేశీయ గోజాతుల సంర‌క్ష‌ణ విధానాల‌ను తెలియ‌జేశారు. నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరికి చెందిన శ్రీ ముర‌ళి అనే దాత త‌న 300 ఎక‌రాల్లో గో ఆధారిత వ్య‌వ‌సాయం చేసేందుకు ముందుకొచ్చార‌ని అద‌న‌పు ఈవోకు తెలిపారు.

అద‌న‌పు ఈవో వెంట టిటిడి బోర్డు మాజీ స‌భ్యులు శ్రీ శివ‌కుమార్‌, చిరు ధాన్యాల ఆహార నిపుణులు శ్రీ రాంబాబు, ప్ర‌కృతి వ్య‌వ‌సాయం, దేశీయ గోవుల ప్ర‌చార‌కుడు శ్రీ వాసు, వెంక‌ట‌గిరికి చెందిన దాత శ్రీ ముర‌ళి ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.