TTD CHAIRMAN INSPECTS ARRANGEMENTS FOR AP CM TIRUMALA VISIT _ సిఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

Tirupati, 10 October 2021: TTD Chairman Sri YV Subba Reddy on Sunday inspected all arrangements for the inauguration of several developmental works during the two day long visit of Honourable Chief Minister of Andhra Pradesh Sri YS Jaganmohan Reddy to Tirupati and Tirumala on October 11-12.

 

The Chairman inspected the roof slab works on Alipiri footpath taken up by Reliance group on donation. The Additional EO Sri AV Dharma Reddy explained about a video on the pylon and significance of Alipiri footpath.

 

Thereafter the TTD chairman inspected the Go Mandiram built by a Chennai base donor and enquired about its features like Saptha Go Pradakshinashala, Go Tulabharam etc. from Additional EO and donor Sri Sekhar Reddy.

 

He also inspected the arrangements at the Paediatric Cardiac hospital got up at BIRRD complex including the ICU, operation theatres and Reception.

 

Speaking to media persons later the TTD Chairman said on October 11, Honourable CM will launch all the mega development works of TTD like temporary building of the Paediatric hospital under construction built at a cost of Rs.25 crore, the Alipiri footpath roof slab works of Rs. 25 crore and the Go Mandiram constructed at Rs.15 crore. Later he will participate in the majestic Garuda seva at Srivari temple and present official silk vastrams on behalf of AP Government.

 

On October 12 Tuesday, the Honourable CM will inaugurate the second Boondi potu (kitchen) constructed on donation by Sri N Srinivasan of India Cements. Thereafter he will launch the Kannada and Hindi channels of SVBC along with Karnataka CM Sri Basavaraj Bommai.

 

TTD JEOs Smt Sada Bhargavi and Sri Veerabhrahmaiah, Dr Chandrasekhar Reddy, chairman of Medical infrastructure development corporation, Dr Harikrishna, OSD of AP CM, Urban SP Sri Venkata Appala Naidu, TTD CE Sri Nageswara Rao, Goshala Director Sri Harnath Reddy, BIRRD OSD Sri Reddappa Reddy, CVSO Sri Gopinath Jatti, RMO Sri Shailendra, TTD Health Officer Dr Sridevi, VGO Manohar and others were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సిఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
 
తిరుపతి, 2021 అక్టోబ‌రు 10: ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటన ఏర్పాట్లను టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆదివారం పరిశీలించారు.
 
అలిపిరి నుంచి తిరుమల నడకదారిలో దాత సహకారంతో పునర్నిర్మించిన పైకప్పును ప్రాంతాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి చేత ఆవిష్కరింపచేసే శిలాఫలకం, నడకదారి విశేషాలను వివరించే వీడియో గురించి అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి చైర్మన్ కు వివరించారు.
 
అనంతరం దాత నిర్మించిన గో మందిరం ఏర్పాట్లను చూసి అధికారులకు పలు సూచనలు చేశారు. సప్త గో ప్రదక్షిణ శాల, గో తులాభారం ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, దాత శ్రీ శేఖర్ రెడ్డి వివరాలు తెలియజేశారు.
 
అనంతరం చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి చిన్న పిల్లల గుండె చికిత్సల ఆసుపత్రి లో ఏర్పాట్లను పరిశీలించారు. ఆసుపత్రిలో ఐసీయూ,  ఓపి, ఆపరేషన్ థియేటర్లు, రిసెప్షన్ విభాగాలను పరిశీలించారు.
 
సిఎం పర్యటన ఏర్పాట్లు సిద్ధం – చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
 
ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటన ఏర్పాట్లు సిద్ధమయ్యాయని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ప్రారంభోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 11వ తేదీ సోమవారం ముఖ్యమంత్రి  శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి  తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు.ఈ సందర్భంగా  తిరుపతిలో రూ 25 కోట్ల ఖర్చుతో నిర్మించిన  చిన్న పిల్లల గుండె జబ్బుల చికిత్సల ఆసుపత్రి  తాత్కాలిక భవనాన్ని ప్రారంభిస్తారన్నారు. అనంతరం అలిపిరి నుంచి తిరుమలకు రూ 25 కోట్లతో దాత నిర్మించిన పైకప్పును,  అలిపిరి వద్ద మరో దాత రూ 15 కోట్లతో నిర్మించిన  గోమందిరాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం తిరుమల చేరుకుని గరుడోత్సవం సందర్భంగా శ్రీవారి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. 
 
12వ తేదీ మంగళవారం తిరుమలలో  దాత నిర్మించిన నూతన బూందీపోటును, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కన్నడ ,హింది ఛానళ్లను ప్రారంభిస్తారనితెలిపారు. తిరుపతి ఎంపి డాక్టర్ గురుమూర్తి, టీటీడీ  జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, వైద్య మౌళిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్ర శేఖర రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ హరికృష్ణ, అర్బన్ ఎస్పీ శ్రీ వెంకట అప్పల నాయుడు, టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి, బర్డ్ ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి, సిఎస్ఆర్ఎంఓ శ్రీ శేష శైలేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.