SRIVILLIPUTTUR GODAMALAS REACHES TIRUMALA _ తిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలు

TIRUMALA, 10 OCTOBER 2021:  As per the set traditions, devotees hailing from Srivilliputtur in Tamil Nadu presented special garlands made of ‘Tulasi’ and other sacred flowers to the Tirumala temple on Sunday, on the most important occasion of Garuda seva which is slated to be held on Monday.

 

Two huge specially designed garlands, Andal Mala and Sikhamani Mala were brought to Pedda Jeeyar Mutt located adjacent to Sri Bedi Anjaneya Swamy mutt. In a colourful procession these were brought to temple. The presentation of these garlands on behalf of the ‘Goda Devi’ temple to Lord Venkateswara a day ahead of the ‘Garuda’ seva was part of the holy dictum set by the great Sri Vaishnava Saint Sri Ramanujacharya.

 

Tirumala Pedda Jeeyar Swamy, Chinna Jeeyar Swamy of Tirumala, Tamilnadu Endowments Minister Sri Sekhar Babu, Srivilliputtur temple Chairman Sri Ravichandran, Tirumala temple DyEO Sri Ramesh Babu were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలు

తిరుమల, 2021 అక్టోబరు 10: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవిమాలలు ఆదివారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద శ్రీ పెద్దజీయ‌ర్‌ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అక్కడ శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడినుంచి త‌మిళ‌నాడు దేవాదాయ శాఖ మంత్రి శ్రీ శేఖ‌ర్ బాబు, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్ బాబు, శ్రీవిల్లిపుత్తూరు ఆల‌య ఛైర్మ‌న్ శ్రీ ర‌విచంద్ర‌న్ ఆధ్వ‌ర్యంలో మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు.
 
శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగమన్నార్‌స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్‌ పుష్పకైంకర్యం చేసేవార‌ని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేవార‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్‌ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించార‌ని పురాణ క‌థ‌నం. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని భావిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.