TTD CHAIRMAN PRESENTS PATTU VASTRAMS TO TIRUTTANI TEMPLE _ దేశం సుభిక్షంగా ఉండాలని సుబ్రమణ్య స్వామిని ప్రార్థించా

Tirumala, 23 July 2022: On the occasion of Adi Kritika fete, the TTD Chairman Sri YV Subba Reddy presented pattu vastrams to Sri Subramaniam Swami temple at Tiruttani on Saturday.

 

Speaking on the occasion the TTD Chairman said it was a tradition to present pattu vastrams on behalf of Srivari temple to Tanikesan on the auspicious day of Adi Krittika and said he prayed for the well-being of people in the aftermath of the Covid Pandemic.

 

Earlier the Chairman couple were received with traditional honours by temple Archakas at Tiruttani and later presented pattu vastrams to utsava idols of Sri Valli Devasena sameta Sri Subramanya Swami. Thereafter the Archakas presented Thirtha Prasadams and Swamivari Vastrams to the Chairman couple.

 

The Chairman said TTD had rolled out several infrastructural arrangements for the benefit of large numbers of devotees from Tamilnadu who during Aadi and Peritasi months make pilgrimage on foot to Tirumala.

 

Tiruttani Temple Deputy Commissioner Smt Vijaya and Srivari temple Parupattedar Sri Umamaheswar Reddy and others were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUMALA

దేశం సుభిక్షంగా ఉండాలని సుబ్రమణ్య స్వామిని ప్రార్థించా
– తమిళనాడు నుంచి తిరుమలకు నడచి వచ్చే భక్తులకు సదుపాయాలు
టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుమల 23 జూలై 2022: కరోనా నుంచి దేశం విముక్తి పొంది ప్రజలంతా సుభిక్షంగా ఉండేలా ఆశీర్వదించాలని శ్రీ సుబ్రమణ్య స్వామిని ప్రార్థించానని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.

ఆడికృత్తిక సందర్బంగా శనివారం ఆయన సతీసమేతంగా తిరుత్తణి శ్రీ సుబ్రమణ్య స్వామి వారికి టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. 

ఆలయం వద్దకు చేరుకున్న శ్రీ సుబ్బారెడ్డి దంపతులకు ఆలయ అధికారులు అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు అనంతరం
తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తెచ్చిన పట్టువస్త్రాలను చైర్మన్ దంపతులు ఆలయ అర్చకులకు అందజేశారు ఈ వస్త్రాలను శ్రీ వల్లీ దేవసేన సుబ్రమణ్య స్వామి ఉత్సవ మూర్తులకు అలంకరించారు. 

అనంతరం ఆలయ అర్చకులు అధికారులు చైర్మన్ దంపతులకు తీర్థ ప్రసాదాలు స్వామివారి వస్త్రాలు అందజేశారు. 

ఈ సందర్బంగా చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు ఆడికృత్తిక సందర్బంగా టీటీడీ తరపున శ్రీ వల్లీ దేవసేన సుబ్రమణ్య స్వామికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు నడచివస్తారని చెప్పారు వీరి కోసం టీటీడీ పలు ఏర్పాట్లు చేస్తోందన్నారు. 

ఆలయ డిప్యూటీ కమిషనర్ శ్రీమతి విజయ తిరుమల ఆలయ పారు పత్తేదారు శ్రీ ఉమామహేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది