SRI VENKATESWARA VAIBHAVOTAVAMS FROM AUGUST 16-20 AT NELLORE _ శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల ద్వారా భక్తుల చెంతకే భగవంతుడు : – జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం

TTD JEO INSPECTS THE ONGOING ARRANGEMENTS

 Tirupati, 23 July 2022: TTD is organising the Sri Venkateswara Vaibhavotsavams, a fete replicating the Nitya Kainkaryas that are being performed in Srivari temple at Tirumala which are scheduled to be observed at Sri Potti Sriramulu Nellore district from August 16-20 for the benefit of devotees.

TTD JEO Sri Veerabrahmam on Saturday along with Local MP Sri Vemireddy Prabhakar Reddy inspected the AC Subba Reddy Stadium, venue chosen for the celestial fete and made valuable suggestions.

Speaking to the media persons the TTD JEO said the objective of the fete is to showcase the traditional Nitya Kainkaryams that are being performed at the Srivari temple for the devotees who could not witness those sevas at Tirumala. “Srivaru will be coming at your doors steps with this fete”, he added.

He said the five-day program of Sri Venkateswara Vaibhavotsavams fete will be conducted at Nellore from August 16-20 and extensive arrangements are under progress to facilitate the participation of devotees.

Addressing the media the Delhi Local Advisory Committee President Smt Vemireddi Prashanti Reddy said a replica model of Srivari temple would be set up at the stadium, in Nellore where all daily sevas starting from Suprabata Seva at 5.30 am to Ekantha Seva at 8.30 pm- will be showcased for the benefit of devotees. She said TTD is setting up Anna Prasadam Counters, primary health centres, devotional and Bhakti sangeet programs for the benefit of devotees and appealed to every one of Nellore and other nearby regions to make use of the divine opportunity.

TTD CE Sri Nageswara Rao, SE-2 Sri Jagadeeshwar Reddy, PRO Dr T Ravi, Dharmic Projects Officer Sri Vijayasaradhi and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUMALA

శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల ద్వారా భక్తుల చెంతకే భగవంతుడు :

– ఆగ‌స్టు 16 నుండి 20వ తేదీ వ‌ర‌కు నెల్లూరులో వైభ‌వోత్స‌వాలు

– జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం

తిరుపతి 2022 జూలై 23: శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల ద్వారా తిరుమ‌ల‌ శ్రీవారు భక్తుల చెంతకే వచ్చి దర్శనమివ్వ‌నున్నారని ఈ అరుదైన అవకాశాన్నినెల్లూరు జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం కోరారు. నెల్లూరు నగరంలోని ఎ.సి.సుబ్బారెడ్డి స్టేడియంను శనివారం పార్ల‌మెంటు స‌భ్యులు శ్రీ వేమి రెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి, అధికారుల‌తో క‌లిసి జెఈవో ప‌రిశీలించారు.

ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ, శ్రీవేంకటేశ్వరస్వామి వారు కొలువైన తిరుమల ఆలయంలో రోజువారీ స్వామివారికి నిర్వహించే అన్నిరకాల సేవలను భక్తులందరూ వీక్షించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎ.సి.సుబ్బారెడ్డి స్టేడియంలో ఆగస్టు 16 నుంచి 20వ తేదీ వరకు శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. ఉత్సవాల నిర్వహణ కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నామని వివ‌రించారు.

ఢిల్లీ స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షురాలు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి మాట్లాడుతూ, స‌నాత‌న హైంద‌వ ధ‌ర్మ ప్ర‌చారంలో భాగంగా ఇక్కడ‌ శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటుచేసి ఉదయం 5.30 గంట‌ల‌కు సుప్రభాతం నుంచి రాత్రి 8.30 గంట‌ల‌కు ఏకాంతసేవ వరకు అన్నిరకాల సేవలను నిర్వహించనున్నట్టు తెలిపారు. వైభ‌వోత్స‌వాల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు, ప్ర‌థ‌మ చికిత్స‌ కేంద్రాలు, ఆధ్యాత్మిక‌, భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు. భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకుని శ్రీ‌వారి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.

అంత‌కుముందు ఎ.సి.సుబ్బారెడ్డి స్టేడియంలో జ‌రుగుతున్న ప‌నుల‌ను ప‌రిశీలించి అధికారులకు జెఈవో ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఈ కార్యక్రమంలో సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, పిఆర్వో డా|| టి.రవి, ధార్మిక ప్రాజెక్టుల అధికారి శ్రీ విజ‌య‌సార‌ధి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.