TTD CHAIRMAN RECEIVED BLESSINGS FROM PONTIFFS _ పీఠాధిపతులను మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్
Tirumala, 25 March 2025: TTD Chairman Sri B.R. Naidu had a courtesy visit to Vyasaraja Mutt and had the blessings from the Pontiff of Palimaru Mutt Sri Vidyadisha Theertha Swamiji and the Pontiff of Bhimanakatte Mutt Sri Raghuvarendra Theertha Swamiji in Tirumala on Tuesday evening.
On this occasion, the Chairman explained to Swamijis about the various programs undertaken by TTD for the spread of Sanatana Hindu Dharma Prachara and the construction of Srivari temples in the capitals of all the states across the country under the instructions of the Chief Minister of AP Sri Chandrababu Naidu.
Later, the Swamijis honored the Chairman with a Pattu Vastram and presented him a book of Maha Bharatam and blessed him.
TTD board member Sri. Naresh Kumar also was present in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
పీఠాధిపతులను మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్
తిరుమల, 2025, మార్చి 25: పాలిమారు మఠం పీఠాధిపతి విద్యాదీశ తీర్థ స్వామిజీ, భీమనకట్టె మఠం పీఠాధిపతి రఘువరేంద్ర తీర్థ స్వామిజీలను తిరుమలలోని వ్యాసరాజ మఠంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు మంగళవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా హిందూ ధర్మవ్యాప్తికి టీటీడీ చేపడుతున్న కార్యక్రమాలు, ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ నారా చంద్రబాబు ఆదేశాలతో దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు చైర్మన్ స్వామీజీలకు వివరించారు. భక్తులు సంతృప్తిగా తిరుమల యాత్రను పూర్తి చేసుకునేలా టీటీడీ పని చేయాలని పీఠాధిపతులు చైర్మన్ కు సూచించారు. శ్రీవారి అనుగ్రహంతో టీటీడీ తలపెట్టే అన్ని కార్యక్రమాలు సఫలీకృతం కావాలని స్వామీజీలు ఆశీస్సులు అందజేశారు.
అనంతరం చైర్మన్ ను స్వామీజీలు పట్టు శాలువతో సన్మానించి, మహా భారతం గ్రంథాన్ని బహుకరించి ఆశీర్వదం అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నరేష్ కుమార్ పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.