TTD CHAIRMAN SEEKS LAND ALLOTMENT BY MAHA GOVT. TOWARDS CONSTRUCTING AMMAVARI TEMPLE AT NAVI MUMBAI _ నవీ ముంబైలో అమ్మవారి ఆలయ నిర్మాణానికి స్థల కేటాయింపుపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన టిటిడి చైర్మన్
నవీ ముంబైలో అమ్మవారి ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని మహారాష్ట్ర సీఎంకు టీటీడీ చైర్మన్ వినతి పత్రం
తిరుమల, 2025 ఫిబ్రవరి 17: నవీ ముంబైలో అమ్మవారి ఆలయం, టీటీడీ సమాచార కేంద్రం నిర్మించేందుకు స్థలం కేటాయించాలని కోరుతూ టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు ద్వారా మహారాష్ట్ర సీఎం శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ కు వినతి పత్రం అందజేశారు.
సోమవారం సాయంత్రం తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ సెంటర్ లో మూడు రోజుల పాటు జరగనున్న కుంభ్ ఆఫ్ టెంపుల్స్ సదస్సు తొలిరోజు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు, గోవా సీఎం శ్రీ ప్రమోద్ సావంత్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లతో కలిసి టీటీడీ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నవీ ముంబైలో అమ్మవారి ఆలయం, టీటీడీ సమాచార కేంద్రం నిర్మాణాలకు కొంత స్థలం కేటాయించాలని మహారాష్ట్ర సీఎం కు టీటీడీ చైర్మన్ వినతి పత్రం అందజేశారు.
ఇప్పటికే నవీ ముంబైలో ఉల్వే ప్రాంతంలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం 3.61 ఎకరాల స్థలాన్ని లీజు ప్రాతిపదికన కేటాయించారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరో 1.50 ఎకరాల స్థలంలో అమ్మవారి ఆలయాన్ని కూడా నిర్మించాలని టీటీడీ నిర్ణయించిందని, ఈ మేరకు స్థలాన్ని కేటాయించాలని, బాంద్రాలో టీటీడీ సమాచార కేంద్రానికి కూడా కొంత స్థలాన్ని కేటాయించాలని టీటీడీ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.