TTD EO SURPRISE INSPECTION _ నడక దారిలో టీటీడీ ఈవో ఆకస్మిక తనిఖీలు

Tirumala, 03 February 2025: TTD EO Sri J. Syamala Rao conducted a surprise inspection at Mokali Mitta on Alipiri Walkway on Monday. 

After inspecting the toilets along the footpath, the staff there were instructed to keep the toilets clean from time to time so that the devotees do not face any inconvenience.   

Ambulance service was examined and many instructions were given to the concerned employees.

Later he spoke to the devotees coming to Tirumala and gathered their feedback about the facilities being provided by TTD along the footpath.

At Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex(MTVAC) he dined along with the devotees and also received their opinion regarding the taste and quality of food.

Later he also verified the cleanliness in the premises.

DyEO Sri Rajendra Kumar was also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నడక దారిలో టీటీడీ ఈవో ఆకస్మిక తనిఖీలు

తిరుమల, 2025 ఫిబ్రవరి 03: అలిపిరి నడక మార్గంలోని మోకాలి మిట్ట వద్ద సోమవారం టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

నడక మార్గంలోని మరుగుదొడ్లను పరిశీలించి అక్కడున్న సిబ్బందిని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అంబులెన్స్ సర్వీసును పరిశీలించి ఉద్యోగులకు పలు సూచనలు చేశారు. తిరుమలకు వస్తున్న భక్తులతో మాట్లాడి నడక దారిలో టీటీడీ ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి అభిప్రాయాలు సేకరించారు.

అనంతరం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఈవో తనిఖీలు నిర్వహించారు. అక్కడ భక్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా అన్న ప్రసాదంపై భక్తుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.