A RARE DONATION OF ITS KIND _ గోవిందునికి అరుదైన విరాళం
RS.50L DONATED TO SV SARVA SHREYAS TRUST
EVERY PENNY SAVED FOR THIS DAY-DONOR
ADDITIONAL EO COMPLIMENTS THE LARGESSE
TIRUMALA, 03 FEBRUARY 2025: Srivari devotees who are spread across the globe usually donate to the various Trusts and Schemes of TTD and associate themselves in the large-scale philanthropic activities of TTD to the needy.
On Monday, a unique kind of donation was received where a septuagenarian donor has donated every penny she has saved in the last 35years of her service in various positions in the Development Sector towards the welfare of the orphan and poor children studying in the TTD educational institution.
Going into the details, Smt C. Mohana from Renigunta has donated Rs.50lakh to the Sri Venkateswara Sarva Shreyas(SV Balamandir) Trust of TTD. She handed over the DD for the same amount to the TTD Additional EO Sri Ch Venkaiah Chowdary at the latters camp office in Tirumala.
Having worked in various positions in the Development and Disaster Management sectors at Casavo, Albania, Yemen, Saudi besides India. Smt Mohana has worked with UN, American and British Charities during Tsunami and also at times of several Earthquakes, cyclones between 1982-94 in these countries.
Complimenting the largesse of the donor, the Additional EO said, she is truly inspiring for many others. In her professional career spanning for over three and a half decades, she decided to donate her earnings to the Universal Lord Sri Venkateswara Swamy and be a part in the charitable activities taken by TTD through several trusts and schemes which is commendable, he maintained.
గోవిందునికి అరుదైన విరాళం
వెంకన్నకు కానుకగా ఆదా చేసిన ప్రతి పైసా
ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్ట్‌కు రూ.50 లక్షలు విరాళం
దాత శ్రీమతి మోహనను అభినందించిన టీటీడీ అదనపు ఈవో
తిరుమల, 2025 ఫిబ్రవరి 03: ఏడుకొండల్లో కొలువైన వెంకన్నకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. వారు టీటీడీకి చెందిన వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు ఇస్తారు. అలాగే పేదల కోసం టీటీడీ నిర్వహించే దాతృత్వ కార్యకలాపాలల్లోనూ భాగస్వాములుగా ఉంటారు. అయితే సోమవారం శ్రీవారికి అందిన విరాళం చాలా అరుదైనదిగా నిలిచిపోయింది. భారత్ సహా పలు దేశాల్లో విపత్తు అధికారిగా సేవలు అందించిన ఓ మహిళ, తన జీవితంలో ఆదా చేసిన ప్రతి పైసాను వెంకన్నకు కానుకగా సమర్పించారు. టీటీడీ విద్యా సంస్థల్లో చదువుతున్న అనాథ, పేద పిల్లల సంక్షేమం కోసం ఈ విరాళాన్ని వినియోగించనున్నారు.
రేణిగుంటకు చెందిన శ్రీమతి సి.మోహన భారతదేశంతో పాటు కాసావో, అల్బేనియా, యెమెన్, సౌదీ అరేబియాలలో అభివృద్ధి – విపత్తు నిర్వహణ రంగాలలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఉద్యోగరీత్యా ఆమె ఎక్కడ పనిచేస్తున్నా, గోవిందుని నామస్మరణను మాత్రం మర్చిపోలేదు. అంతేకాదు, తన వృత్తిజీవితంలో ఆదా చేసిన ప్రతి రూపాయిని శ్రీవారికి కానుకగా ఇవ్వాలని నిర్ణయించారు. ఆ విధంగా ఆదా చేసిన రూ.50 లక్షలను టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర సర్వ శ్రేయాస్(ఎస్వీ బాలమందిర్) ట్రస్ట్‌కు ఇచ్చారు. ఆ మొత్తాన్ని డీడీ రూపంలో తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్.వెంకయ్య చౌదరికి అప్పగించారు. ఆమె దాతృత్వాన్ని వెంకయ్య చౌదరి కొనియాడారు. మూడున్నర దశాబ్దాలకుపైగా తన వృత్తి జీవితంలో సంపాదించిన ధనాన్ని, గోవిందుడి కృపతో అనాథలు, పేదలకు ఉపయోగపడాలనే ఆమె నిర్ణయం ప్రశంసనీయమని అన్నారు.
సునామీ విధ్వంసం సమయంలో శ్రీమతి మోహన ధైర్యసాహసాలతో తన సేవలు అందించారు. 1982-94 మధ్య పలు దేశాలలో అనేక భూకంపాలు, తుఫానులు కలిగించిన కష్టాల్లో కూడా ఐక్యరాజ్యసమితి, అమెరికా, బ్రిటిష్ ఛారిటీలతో కలిసి పనిచేసి ప్రజలకు తన వంతు సాయం అందించారు. ఇప్పుడు కూడా శ్రీవారి ద్వారా పేద ప్రజలకు తన సంపాదన ఉపయోగపడాలని భావించి, అరుదైన విరాళాన్ని అందించారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.