TTD IS EPITOME OF SANATANA HINDU DHARMA PRACHARA -JEO(E & H) _ విస్తృతంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం : జెఈఓ శ్రీమతి సదా భార్గవి

TAKES PART IN BHAGAVATA SAPTAHAM AT NAIMISARANYA

TIRUPATI, 15 DECEMBER 2022: The world-famous Hindu religious organisation of Tirumala Tirupati Devasthanam which administers the affairs of the Hill temple of Lord Venkateswara in Tirumala, is undoubtedly the epitome of Hindu Sanatan Dharma Prachara, advocated JEO (E & H) Smt. Sada Bhargavi.

The JEO who participated in the Vishwa Shanti Homam and Bhagavata Saptaham at Naimisaranya(near Uttar Pradesh) on Thursday addressing a huge gathering of 2000 devotees said TTD has taken up various spiritual programs in the last couple of years under the instructions of TTD Chairman Sri YV Subba Reddy in the able supervision of EO Sri AV Dharma Reddy which won worldwide appreciation.

She complimented all the women folk, hailing from different southern states who have taken part in the spiritual program with devotion and enthusiasm. The JEO also complimented Dasa Sahitya Project for organising this unique programme since 2008. She said she is fortunate to head all the Projects of TTD with the blessings of Lord Venkateswara and asserted to take forward the glory of Srivaru with more such unique programs in future.

The Dasa Sahitya Project Special Officer Sri Ananda Theerthacharyulu said, Naimisaranya is the home place for the origin of Vedas, Puranas and Hindu Sanatana Dharma. The Bhagavata Saptaham commenced on December 9 and will conclude on December 16. He also thanked the JEO for having enlightened the participants with her speech.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

విస్తృతంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం : జెఈఓ శ్రీమతి సదా భార్గవి

– నైమిశారణ్యంలో విశ్వశాంతి హోమం, భాగవత సప్తాహం

తిరుపతి, 2022 డిసెంబర్ 15: ప్రపంచ ప్రఖ్యాత హిందూ ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానములు సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని విస్తృతంగా చేపడుతోందని టిటిడి జెఈఓ శ్రీమతి సదా భార్గవి అన్నారు. ఉత్తరప్రదేశ్ సమీపంలోని నైమిశారణ్యంలో జరుగుతున్న విశ్వశాంతి హోమం, భాగవత సప్తాహంలో గురువారం జెఈఓ పాల్గొన్నారు. దాదాపు 2000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈఓ శ్రీ ఎవి ధర్మారెడ్డి పర్యవేక్షణలో టిటిడి నిర్వహిస్తున్న ధర్మప్రచార కార్యక్రమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నుండి ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు. భక్తి, ఉత్సాహంతో ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణాది రాష్ట్రాల మహిళలను ఆమె అభినందించారు.

2008 నుండి ఈ విశిష్టమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు దాససాహిత్య ప్రాజెక్ట్‌ను జెఇఓ అభినందించారు. శ్రీ వేంకటేశ్వరుని ఆశీస్సులతో టిటిడిలోని ధార్మిక ప్రాజెక్టులకు సారథ్యం వహించడం తన అదృష్టమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విశిష్టమైన కార్యక్రమాలతో శ్రీవారి వైభవాన్ని దేశం నలుమూలల వ్యాప్తి చేస్తామని చెప్పారు.

దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు మాట్లాడుతూ నైమిశారణ్యం వేదాలు, పురాణాలు, హిందూ సనాతన ధర్మానికి నిలయమన్నారు. డిసెంబరు 9న ప్రారంభమైన భాగవత సప్తాహం డిసెంబర్ 16న ముగుస్తుందని తెలిపారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.