LONG TERM PILGRIM-CENTRIC PLANS FOR TIRUCHANOOR TEMPLE-TTD JEO _ తిరుచానూరులో భక్తుల సౌకర్యాల కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు- జెఈఓ శ్రీ వీరబ్రహ్మం

Tirupati,15 December 2022: TTD JEO Sri Veerabrahmam has directed officials on Thursday to prepare an action plan to develop more devotee-centric facilities in view of a huge turnout to Tiruchanoor temple in future.

He made an inspection at Sri Padmavathi Ammavaru temple along with FA&CAO Sri Balaji and made valuable suggestions on space utilisation etc. Among others he advised the removal of waste materials at Yagashala to facilitate easy Pradakshina, precautionary measures at Anna Prasadam queue lines, priority for cleanliness inside temple, rejuvenation of a deep well at public gardens and verify water purity of drinking water etc.

The JEO also inspected the garlands-making machine, flour store and electrical rooms, Pushkarini, Tolappa Gardens and vahana mandapams works.

SE (Electrical) Sri Venkateswarlu, temple DyEO Sri Lokanatham, EEs Sri Narasimha Murti, Sri Manoharam, Additional Health Officer Dr Sunil Kumar, AEO Sri Prabhakar Reddy, Archaka Sri Babuswami, AVSO Sri Shailendra Babu and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుచానూరులో భక్తుల సౌకర్యాల కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు- జెఈఓ శ్రీ వీరబ్రహ్మం

తిరుపతి, 2022 డిసెంబర్ 15: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ పెరిగే ఆకాశం ఉన్నందున వసతులు పెంచేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఎఫ్ఎ అండ్ సీఈవో శ్రీ బాలాజితో కలిసి ఆయన తనిఖీలు నిర్వహించారు. యాగశాలలో నిరుపయోగంగా ఉన్న సామగ్రిని తొలగించడం వల్ల ప్రదక్షిణ చేయడానికి సౌకర్యంగా ఉందన్నారు. ప్రసాదాల పంపిణీ కేంద్రాల వద్ద క్యూలైన్లలో భక్తులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆలయంలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని అదనపు ఆరోగ్యాధికారికి సూచించారు. ఫ్రైడే గార్డెన్లో దిగుడు బావిని పరిశీలించి పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. బావిలోని ఊట నీరు ఆలయ అవసరాలకు ఉపయోగపడతాయేమో పరిశీలన జరపాలని అధికారులకు సూచించారు.

అనంతరం పూలమాలల తయారీ ప్రాంతం, పిండి మర, విద్యుత్ గదిని పరిశీలించారు. ఈ ప్రదేశాలు భక్తుల అవసరాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అమ్మవారి ఆలయ పుష్కరిణి సందర్శించి అక్కడ చేయాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. తోళప్ప గార్డెన్, వాహన మండపం వద్ద జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు.

విద్యుత్తు విభాగం ఎస్ఇ శ్రీ వెంకటేశ్వర్లు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇఇలు శ్రీ నరసింహ మూర్తి, శ్రీ మనోహర్, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ కుమార్, ఏఈఓ శ్రీ ప్రభాకర్ రెడ్డి, అర్చకులు శ్రీ బాబుస్వామి, ఎవిఎస్వో శ్రీ శైలేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.