TTD MAKES ALTERNATE ARRANGEMENTS OF SANITARY WORKERS _ తిరుమలలో భక్తులకు అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య చర్యలు

JEO VEERABRAHMAM PERSONALLY SUPERVISING THE ARRANGEMENTS

 

TIRUMALA, 25 APRIL 2023: With the Sulabh Workers going on a strike without prior intimation, TTD has made alternate arrangements ensuring that visiting pilgrims are not to put to any sort of inconvenience with the issues of hygiene and cleanliness in Tirumala.

 

At present, in Tirumala, the sanitary workers who are deployed have been rendering services in four shifts round the clock at Annaprasadam Complex, VQC 1 and 2, Laddu Complex, Garbage lifting, sweeping the roads, cleaning toilets etc. On the other hand, the staff of the Facility Management Services (FMS) have also ensuring that their respective places are kept spick and span.

 

Upon the instructions of TTD EO Sri AV Dharma Reddy, under the personal supervision of JEO Sri Veerabrahmam, a committee headed by SE 2 Sri Jagadeeshwar Reddy with all EEs and DyEEs working in Tirumala as members along with the Health Officer Dr Sridevi are ensuring that the premises of Tirumala are kept clean and hygienic.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

తిరుమలలో భక్తులకు అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య చర్యలు

– నాలుగు షిఫ్టుల్లో సిబ్బంది విధులు

– జెఈవో శ్రీ వీరబ్రహ్మం నేతృత్వంలో అధికారుల పర్యవేక్షణ

తిరుమల, 25 ఏప్రిల్ 2023: తిరుమలలో విధులు నిర్వహిస్తున్న సులభ్ కార్మికులు విధులు బహిష్కరించి నిరసన తెలియజేస్తున్న తరుణంలో టిటిడి పటిష్టమైన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 24 గంటల పాటు పారిశుద్ధ్య చర్యలు చేపడుతోంది.

తిరుమలలో ప్రస్తుతం నాలుగు షిఫ్టుల్లో సిబ్బంది సేవలందిస్తున్నారు. వీరికి తోడుగా విశ్రాంతి గృహాల్లో ఎఫ్ఎంఎస్ సిబ్బంది ఆయా ప్రాంతాల్లో చక్కగా పారిశుద్ధ్య నిర్వహణ చేపడుతున్నారు.

అన్న ప్రసాదం కాంప్లెక్స్, వైకుంఠ క్యూ కాంప్లెక్స్ -1, 2, లడ్డూ కాంప్లెక్సుల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వివిధ ప్రాంతాల్లో చెత్త తరలింపు, బహిరంగ మరుగుదొడ్లను శుభ్రం చేయడం, రోడ్లు శుభ్రం చేయడం తదితర పనులు చేస్తున్నారు. అదేవిధంగా నాలుగు యంత్రాలతో ఎప్పటికప్పుడు రోడ్లను శుభ్రం చేస్తున్నారు.

కాగా, తిరుమలలోని ఆయా ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యలను పర్యవేక్షించేందుకు వీలుగా ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమలలోని ఇఇలు, డెప్యూటీ ఇఇలతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు జెఈవో శ్రీ వీరబ్రహ్మం పర్యవేక్షణలో ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి, ఇతర ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.