TTD PRESENTS SILK VASTRAMS TO SRI MANTRALAYA RAGHAVENDRA _ మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామివారికి శేషవస్త్రం సమర్పించిన టిటిడి అదనపు ఈవో
TIRUMALA, 24 AUGUST 2021: On the auspicious occasion of 350th Aradhana Mahotsavams of Sadguru Sri Raghavendra Swamy, TTD Additional EO AV Dharma Reddy on Tuesday presented the silk vastrams on behalf of TTD.
After offering the silks, the Additional EO also received the blessings of the Pontiff of Mantralaya Sri Raghavendra Mutt, HH Sri Subudendratheertha.
Meanwhile, TTD has been offering the Vastrams since 2006. As Sri Raghavendra Swamy is believed to have born to his parents with the blessings of Sri Venkateswara Swamy and even known as Venkatanatha during his purvashram, the presentation of silk Vastrams to this ancient Institution of Sanatana Hindu Dharma assumes importance.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామివారికి శేషవస్త్రం సమర్పించిన టిటిడి అదనపు ఈవో
తిరుమల, 2021 ఆగస్టు 24: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ గురురాఘవేంద్ర స్వామివారి 350వ ఆరాధన మహోత్సవాల సందర్భంగా టిటిడి తరపున అదనపు ఈవో శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి మంగళవారం ఉదయం శేషవస్త్రం సమర్పించారు.
హైందవ సనాతన ధర్మవ్యాప్తికి కృషి చేసిన సద్గురువుల భగవత్ భాగవత సేవల దృష్ట్యా 2006వ సంవత్సరం నుంచి శ్రీ రాఘవేంద్రస్వామివారికి శ్రీవారి శేషవస్త్రాన్ని టిటిడి సమర్పిస్తోంది. సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారి కృపతో శ్రీ రాఘవేంద్రస్వామివారు జన్మించారు. శ్రీరాఘవేంద్రస్వామి పూర్వాశ్రమ నామధేయం కూడా వెంకన్న భట్ట, వెంకటాచార్యగా ప్రశస్తి.
ముందుగా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠాధిపతి శ్రీ సుబుదేంద్రతీర్థ స్వామివారికి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి శేషవస్త్రాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీ సుబుదేంద్రతీర్థ స్వామివారు అదనపు ఈవోను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయం ఒఎస్డీ శ్రీ పాల శేషాద్రి పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.