QUALITY SANITATION WITH IIT TECHNICAL SUPPORT- EO _ తిరుమ‌ల‌లో పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ చ‌క్క‌గా ఉండాలి

Tirumala, 24 August 2021: Maintain clean environs in Tirumala and collaborate with IIT for Technical know-how to ensure the same, said TTD Executive Officer Dr KS Jawahar Reddy.

Addressing a review meeting of Health officials at his chambers in the TTD Administrative Building in Tirupati on Tuesday, the TTD EO said cleanliness should be given top priority in view of the health safety of devotees.

He directed officials to take up road cleaning at 3am daily instead of 5am to enhance a healthy environment.

The EO also instructed that all sanitary inspectors and supervisors should chalk out an action plan with the adequate sanitation staff in all seven wards of Tirumala, giving no scope for any single complaint and ensure frequent clearance of garbage on roads in dust bins by using gunny sacks.

He also urged officials to clear the garbage on both ghat roads on every alternate day by using sanitary machines.

The EO asked the officials of the health department to put up proposals for the purchase of modern equipment and also supply radium painted jackets to all sanitary workers to avert accidents.

He asked officials to consult IIT and prepare a comprehensive report on existing sanitation conditions in all regions for enhancing the clean environment of Tirumala, additional personnel, quality performance, modern equipment etc.

He also urged senior officers of TTD to adopt regions of Tirumala for maintaining cleanliness and to introduce bio-metric attendance for staff etc.

TTD EO also reviewed the daily sanitation and garbage cleaning in crowded locations of Tirumala and the response of devotees and future needs of men and material of the health department.

CVSO Sri Gopinath Jatti, FA& CAO Sri Balaji, Addition Health Officer Dr Sunil and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమ‌ల‌లో పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ చ‌క్క‌గా ఉండాలి

– ఐఐటి నిపుణుల సూచ‌న‌ల‌తో మ‌రింత మెరుగైన శానిటేష‌న్‌

– టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుమ‌ల, 2021 ఆగ‌స్టు 24: తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణలో రాజీ ప‌డ‌కూడ‌ద‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. టిటిడి పరిపాలన భవనంలోని తన చాంబర్‌లో మంగ‌ళ‌వారం ఆరోగ్య విభాగం అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమ‌ల‌కు వేలాదిగా విచ్చేసే భ‌క్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప‌రిశుభ్ర‌తపై ఎక్కువ దృష్టి సారించాల‌న్నారు. ప్ర‌స్తుతం ఉద‌యం 5 గంట‌లనుండి తిరుమ‌ల‌లో రోడ్ల‌ను శుభ్రం చేస్తున్నార‌ని, దానిని తెల్ల‌వారుజామున‌ 3 గంట‌ల‌ నుంచి ప్రారంభించాలన్నారు. త‌ద్వారా ఉద‌యానికల్లా రోడ్ల‌న్నీ ప‌రిశుభ్రంగా ఉంచేందుకు వీల‌వుతుంద‌న్నారు. తిరుమ‌ల‌లోని ఆరోగ్య విభాగానికి చెందిన 7 వార్డుల్లో త‌గినంత మంది పారిశుద్ధ్య సిబ్బంది, వ‌ర్క‌ర్లు ఉన్నార‌ని, వారిపై మేస్త్రీలు, శానిట‌రీ ఇన్‌స్పెక్ట‌ర్లు పక్కా ప్ర‌ణాళిక‌తో పారిశుద్ధ్య ప‌నులు చేప‌ట్టాల‌న్నారు. ప‌రిశుభ్ర‌త విష‌యంలో చిన్న ఫిర్యాదులు కూడా రాకుండా జాగ్ర‌త వ‌హించాల‌ని చెప్పారు. రోడ్ల‌పై కుప్ప‌లుగా ఉండే చెత్త‌ను డ‌స్టు బిన్లు, గ‌న్ని బ్యాగ్స్ ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు సేక‌రించి త‌ర‌లించాల‌ని ఆదేశించారు.

ముఖ్యంగా రెండు ఘాట్ రోడ్ల‌లో వ‌చ్చే చెత్త‌ను రెండురోజులకోసారి యంత్రాల స‌హాయంతో శుభ్రం చేయాల‌న్నారు. ప్ర‌స్తుతం ఆరోగ్య విభాగం ఉప‌యోగిస్తున్న యంత్రాలు వాడుకుంటూ, ఆధునిక యంత్ర ప‌రిక‌రాల కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల‌న్నారు. విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న శానిట‌రి సిబ్బందికి ఎలాంటి ప్ర‌మాదాలు క‌లుగ‌కుండా వారికి రేడియం జాకెట్లు అందివ్వాల‌న్నారు.

తిరుమ‌ల‌లో ప‌రిశుభ్ర‌త‌ను మ‌రింత మెరుగుప‌ర్చ‌డానికి ఐఐటి నిపుణులను ఆహ్వానించి వారి సూచ‌న‌లు తీసుకోవాల‌న్నారు. అదేవిధంగా ఐఐటి వారి స‌హ‌కారంతో టిటిడి ఆరోగ్య విభాగంకు ఎంత మంది సిబ్బంది అవ‌స‌రం, ప్రమాణాలు, యంత్ర ప‌రిక‌రాలు త‌దిత‌ర అంశాల‌పై స‌మ‌గ్ర నివేదిక రూపొందించి అందించాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. అదేవిధంగా ఆరోగ్య విభాగంకు సంబంధించి వివిద‌ ప్రాంతాల్లో ప‌రిశుభ్ర‌త ఏవిధంగా ఉన్న‌ది, సిబ్బంది అటెండెన్స్ త‌దిత‌ర అంశాల‌ను ప‌రిశీలించ‌డానికి టిటిడి సీనియ‌ర్ అధికారులకు భాధ్య‌త‌లు అప్ప‌గించాల‌న్నారు. వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వ‌హిస్తున్న ఆరోగ్య సిబ్బందికి బ‌యో మెట్రిక్ అటెండెన్స్ ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌ల‌లో అధిక ర‌ద్ధీ ప్రాంతాల్లో, ఇత‌ర ప్రాంతాల్లో రోజువారి శానిటేష‌న్ ఏవిధంగా జ‌రుగుతున్న‌ది, భ‌క్తుల నుండి వ‌స్తున్న స్పంద‌న ఏమిటి, భ‌విష్య‌త్తులో ఆరోగ్య విభాగంకు అవ‌స‌ర‌మైన యంత్ర ప‌రిక‌రాల‌పై ఈవో స‌మీక్షించారు.

సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఎఫ్ఏ అండ్ సిఏవో శ్రీ బాలాజి, ఆరోగ్య విభాగం అధికారి డా.సునీల్‌ సమావేశంలో పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.