TTD TO CONDUCT KARTIKA DEEPOTSAVAM IN VIZAG _ 25 నవంబర్ వైజాగ్‌లో కార్తీక దీపోత్సవం నిర్వహించనున్న టిటిడి
25 నవంబర్ వైజాగ్‌లో కార్తీక దీపోత్సవం నిర్వహించనున్న టిటిడి
తిరుపతి, 2024 నవంబర్ 24: తిరుమల తిరుపతి దేవస్థానాలు మరియు హిందూధర్మ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 25 నవంబర్ 2024 సోమవారం సాయంత్రం 5:00 నుండి రాత్రి 8:00 గంటల వరకు విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలోని టిటిడి కల్యాణ మండపంలో పవిత్ర కార్తీక దీపోత్సవం జరుగనుంది.
వైజాగ్‌లోని భక్తులందరూ ఈ దివ్య కార్యక్రమంలో పాల్గొని శ్రీ వేంకటేశ్వరుని అనుగ్రహం పొందవలసిందిగా టిటిడి సాదరంగా ఆహ్వానిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ వేంకటేశ్వరుని పంచలోహ విగ్రహాలకు పూజలు నిర్వహించి, సంప్రదాయ వైదిక ఆచారాలను అనుసరించి టిటిడి అర్చకులు పూజలు నిర్వహించనున్నారు.
ఈ కార్తీక దీపోత్సవం వేడుకను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. కార్తీక దీపం యొక్క దివ్యమైన కాంతిని అనుభవించడానికి మరియు భగవంతుని అనుగ్రహాన్ని పొందేందుకు భక్తులకు ఇది ఒక అపూర్వ అవకాశం.
భక్తులందరూ పాల్గొని ఈ ఆధ్యాత్మిక వేడుకను ఘనంగా నిర్వహించవలసిందిగా టిటిడి కోరుతోంది.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.